Read more!

English | Telugu

అమెరికన్స్ తో దేశీ స్టెప్స్ వేయించిన ఆర్జే కాజల్!


సేవ్ ది టైగర్స్ సీజన్ 2 లో ఓ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్జే కాజల్ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఎన్నో సినిమాల్లో తన గొంతుతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడేమో అమెరికాకి వెళ్ళింది‌. అక్కడ రోజుకో వ్లాగ్ వేస్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అవి ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

మన ఇండియన్ సైకాలజీ తెలిసిందే కదా.. ఎక్కడికి వెళ్ళినా మన మూలాలని మర్చిపోరు. అది అమెరికా అయిన యూకే అయిన మన భాష.. మన సంప్రదాయం‌. అలాగే మన ఫేవరెట్ సాంగ్స్.‌. ఇలా అన్నింటిని ఫాలో అవుతుంటాం. ఆర్జే కాజల్ కూడ అలానే చేస్తోంది. అమెరికాలోని ఓ ఈవెంట్ కి అటెండ్ అయిన ఈ భామ.. అక్కడ రకరకాల గెటప్ లతో ఉన్నవాళ్ళతో సెల్ఫీలు దిగుతూ, వ్లాగ్స్ చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అయితే డిఫరెంట్ గెటప్ లతో ఉన్న ఓ ఇద్దరితో కొన్ని మన తెలుగు సినిమా పాటలలోని స్టెప్స్ ని వేయించింది. అదంతా ఓ వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో ' అమెరికన్స్ తో దేశీ స్టెప్స్ వేయించా' అనే టైటిల్ లో అప్లోడ్ చేసింది.

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5  ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. మరి మీలో ఎంతమంది తనని ఫాలో అవుతున్నారు. మీరు తన యూట్యూబ్ ఛానెల్ లో చూసిన వ్లాగ్ ఏంటి కామెంట్ చేయండి.