English | Telugu

హాఫ్ డ్రెస్ లో వితిక షేరు.. నెటిజన్ల ఘాటు కామెంట్లు!

వరుణ్ సందేశ్ తో పెళ్లి జరిగిన తర్వాత ఎక్స్ పోజింగ్ ఏమీ లేకుండా సింపుల్ గా చీరకట్టులో‌ కన్పిస్తుంది వితిక షేరు.‌ అయితే తాజాగా తను గోవాకి వెళ్ళింది. అక్కడ బీచ్ చూస్తే తనకి ఆ డ్రెస్సింగ్ అంటేనే ఇష్టమని హాఫ్ డ్రెస్ లో దర్శినమిచ్చింది వితిక షేరు.

వితిక, వరుణ్ సందేశ్‌లు కలిసి వెకేషన్‌కు వెళ్లి చాలా రోజులే అయినట్టుగా ఉంది. అయిన ఇప్పుడు వితిక తన లేడీ గ్యాంగ్‌తో కలిసి సందడి చేస్తోంది. ఎక్కువగా నిహారికతోనే వితిక కనిపిస్తోంది. ఈ సమ్మర్‌లో అలా గోవాలో చిల్ అవుతున్న వితిక. గోవాకు వెళ్లడంతోనే ఇలా కట్టూబొట్టూ మొత్తం మార్చేసింది. స్టైల్, లుక్ అంతా మార్చేసి అలా చిల్ అవుతోంది. ప్రస్తుతం వితిక ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న, సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. చాలా మందికి తెలియని నటి. బిగ్ బాస్ సీజన్-3 లో తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చి అందరిచూపు తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత వితిక మంచి క్రేజ్ సంపాదించుకొని బిజీ జీవితాన్ని గడుపుతుంది.

గోవా బీచ్ లో చిల్ అవుతున్నప్పటి ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ. ఇక వీటికి కామెంట్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నీ పని బాగుందమ్మ మంచిగా రెడీ అవ్వడం వీడియోలు ఫోటోలు తీయడమం.. ఇలాంటి కామెంట్లతో‌ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పెళ్ళి అయింది కదా కాస్త పద్దతిగా ఉండొచ్చు‌ కదా అని మరికొందరు కామెంట్లు చేయగా వితిక మాత్రం ఏ కామెంట్ కి స్పందించడం లేదు‌. ఇక తాజాగా తన కొత్తింట్లో పూజ చేస్తుండగా మరో వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది వితిక. ‌అయితే దానికంటే ఈ హాట్‌ అండ్‌ బోల్డ్ ఫోటోలకే ఎక్కువగా క్రేజ్ వచ్చేసింది. కాగా ఇన్ స్ట్రాగ్రామ్ లో తనకి 1M(మిలియన్) ఫాలోవర్స్ ఉన్నారు. మరి వితిక షేర్ చేసిన ఫోటోలలో, వ్లాగ్స్ లో మీ ఫేవరెట్ ఏంటి.. ఈ పోస్ట్ ని చూసారా కామెంట్ చేయండి.