English | Telugu

బలగం 3 కానీ 4 కానీ ధనరాజ్ ని పెట్టి చేస్తా

నెక్స్ట్ వీక్ ఆలీ తో సరదాగా షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి బలగం వేణు, ధనాధన్ ధనరాజ్ వచ్చారు. ఇక ఆలీ రకరకాల ప్రశ్నలు అడిగాడు.. "ఫస్ట్ యాక్టర్ గా 2003 , డైరెక్టర్ గా 2023 . మూడు బాగా కలిసొచ్చింది కానీ అది కలిసిరావడానికి 20 ఏళ్ళు పట్టింది" అన్నాడు బలగం వేణు. "నాకంటే పెద్ద రాజానా" అని ధనరాజ్ ని అడిగేసరికి "మీరు పెద్ద రాజా ఐతే ధన్ రాజ్ కాట్రాజ్" అన్నాడు వేణు. "సరిగ్గా నటించకపోయినా, మాట వినకపోయినా కొట్టేవాడాయన " అని ఆలీ అనేసరికి "ఆయన చేతి రుచి తగిలివాళ్ళంతా స్టార్స్ ఇపోయారు..నాకు తగల్లేదు ధనరాజ్ కి తగల్లేదు..కొంచెం లేట్ అయ్యింది" అన్నాడు వేణు. "బలగంలో నువ్వు నటించావా" అని అడిగాడు ఆలీ "లేదు నటించలేదు" అన్నాడు ధనరాజ్. "మరి క్లోజ్ ఫ్రెండ్ అన్నావ్ గా వేణుని" అని ఆలీ అడిగాడు. "బలగం 3 కానీ 4 కానీ ధనరాజ్ ని పెట్టి చేస్తా" అన్నాడు వేణు.

"బలగం మూవీ తీద్దామనుకున్నప్పుడు ఒక టెక్నిషియన్ వచ్చి పెద్ద బాహుబలి అన్నట్టు ఫీలవుతున్నావ్ అన్నాడు. తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక మీరు అన్నారు చిన్న సినిమాల్లో ఈ మూవీ బాహుబలి అని" అన్నాడు వేణు. చివరిలో వేణు గోచీ పెట్టుకుని ధ్యానం చేస్తున్న పిక్ చూపించి "ఏంటి గోచి బాబానా" అని ఆలీ అడిగాడు "అది మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు తీసిన ఫోటో" అన్నాడు వేణు. "అంటే డైరెక్టర్స్ కి ఈ ఫోటోనే చూపించావా" అన్నాడు ఆలీ. "ఏంటి ధనరాజ్ పెళ్లికి ముందు కనిపించినవాళ్లందరినీ లవ్ చేసేసావంటా" అని అడిగేసరికి "పెళ్ళికి ముందు అన్నారేంటి పెళ్ళికి తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది" అంటూ ధనరాజ్ గురించి చెప్పాడు వేణు. ఇలా ఈ వారం ఎపిసోడ్ వీళ్ళతో రాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.