Read more!

English | Telugu

చరణ్ అర్జున్ కి  ఈ సినిమాతో  బ్రేక్ దొరుకుతుందా!


కొంతమంది లిరిక్ రైటర్స్ ఎన్ని హిట్ సాంగ్స్ రాసిన పెద్దగా పేరు రాదు. అయితే ఎప్పుడైతే జనాల గుండెల్లో నిలిచిపోతూ.. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటుందో అప్పుడే  ఆ పాట రాసిందెవరని, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది. అలాంటిదే ఈ మధ్య కాలంలో ఒక పాట ఫుల్ వైరల్ అయింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో సీఎమ్ రేవంత్ రెడ్డి మీద వచ్చిన పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటతోనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం జనాల్లోకి మరింతగా వెళ్లిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ పాటను చరణ్ అర్జున్ కంపోజ్ చేశాడు. 

రేవంత్ రెడ్డి కోసం అంత గొప్ప పాట రాసిన చరణ్ అర్జున్.. ఇప్పుడు సీతాకళ్యాణ వైభోగమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మూడు రంగుల జెండా పట్టి అంటూ చరణ్ అర్జున్ రాసిన, కంపోజ్ చేసిన పాటతోనే రేవంత్ రెడ్డి ఇంకా జనాల్లోకి వెళ్లాడన్నది అందరూ ఒప్పుకునే అంశమే. ఓ పాట ఇంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందా? అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ పాటతో చరణ్ అర్జున్ పేరు మరోసారి మార్మోగిపోయింది. చరణ్ అర్జున్ యూట్యూబ్‌ చానెల్‌లో మిలియన్ల వ్యూస్‌తో ఎన్నో పాటలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే చరణ్ అర్జున్‌కి టాలీవుడ్‌లో మాత్రం సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఎప్పుడు రాజకీయ నాయకుల పాటలు, ఎమోషనల్ పాటలు మాత్రమే రాస్తాడనే, వాటికే మ్యూజిక్ చేస్తాడనే ముద్ర వేస్తున్నారంట‌ కొందరు. తాజాగా సీతాకళ్యాణ వైభోగమే అంటూ చరణ్ అర్జున్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు తన పాటల్ని తీసుకొస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సీతాకళ్యాణ వైభోగమే సినిమాతో బ్రేక్ వస్తుందని అతను ఆశిస్తున్నాడు. 

తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతను పాల్గొన్నాడు. స్టేజ్ మీద తన ఆవేదనను వ్యక్తపరిచాడు. సోషల్ మీడియా ఆనాడు లేదు.. అప్పట్లోనే నేను అనుష్కను .. ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అంటూ వర్ణించి పాట రాసి కంపోజ్ చేశాను. రచ్చ చిత్రంలో డిల్లకు డిల్లకు డిల్లా అనే పాటను నేనే రాశాను. ఇలా చాలా పాటలు రాశాను. ఎన్నో కంపోజ్ చేశాను.. కానీ వాటిని ఇక్కడ చెప్పలేను. శంభో శివ శంభో టైటిల్ సాంగ్ కూడా నేనే చేశాను.. ఎంత గొప్పగా పని చేసినా నాకు మాత్రం ఇంత వరకు ఓ బ్రేక్ రాలేదు.. గుర్తింపు రాలేదు. ఎంతో మంది నా పాటలు యూబ్యూబ్‌లో విని కామెంట్లు పెడుతుంటారు.. నాకు బ్రేక్ రావాలని వారంతా కోరుకుంటు ఉంటారు.. ఈ సినిమాతో నాకు ఆ బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను.. ఈ పాటలన్నీ నేనే చేశానని చెప్పుకునేందుకు నాకు ఇన్ని రోజులు పట్టింది.. ఇన్ని రోజులకు నాకు ఒక స్టేజ్, ఒక మైక్ దొరికిందంటు చరణ్ అర్జున్ చెప్పుకొచ్చాడు.