English | Telugu

అర్థరాత్రి అమర్ దీప్‌తో సురేఖవాణి కూతురు.. 3 గంటలవరకు అక్కడే!

ఓ వైపు టీవీరంగంలో , మరో వైపు సినిమా పరిశ్రమలో పేరు తెచ్చుకుంది నటి సురేఖవాణి. త్వరలో తన కూతురిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయనుంది ఈ భామ. సురేఖవాణి కూతురు సుప్రిత మొదటి సినిమా షూటింగ్ మొదలైంది.

అమర్ దీప్, సుప్రిత కలిసి ఈ సినిమాని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో టీమ్ అంతా బిజీగా ఉంది. అయితే ఈ మూవీ కోసం అర్థరాత్రి దాటినా కూడా నిర్విరామంగా షూటింగ్ చేస్తూనే ఉన్నారని సుప్రిత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ మూవీ సెట్‌లో టేస్టీ తేజ, శుభ శ్రీ సందడి చేశారని వారితో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. అమర్ దీప్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మొదలు పెట్టిన మొదటి సినిమా కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. అందులో సురేఖా వాణి కూతురు సుప్రిత హీరోయిన్ అవ్వడంతో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ప్రస్తుతం అమర్ దీప్, సుప్రిత మూవీ షూటింగ్ లో ఉన్నారు. నిన్న రాత్రి జరిగిన సినిమా‌ షూటింగ్ అర్థరాత్రి అయిన ముగియలేదని ఉదయం మూడు గంటలకి ప్యాకప్ అయిందని ఇన్ స్టాగ్రామ్ వేదికగా సుప్రిత షేర్ చేసింది. సుప్రితకి ఇన్ స్టాగ్రామ్ లో 841K ఫాలోవర్స్ ఉన్నారు. అమర్ దీప్, సుప్రిత కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు తమ ట్యాలెంట్ ని నిరూపించుకోవాల్సిన సమయమిది. కాబట్టి ఈ మూవీ సక్సెస్ అయితేనే తర్వాత వారికి ఆఫర్లు వస్తాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.