Read more!

English | Telugu

గడ్డాలు, మీసాలు తీసేసి శ్రీముఖిని మోసం చేసిన బ్రిట్టో

నీతోనే డాన్స్ 2 .0 ఈ వారం శనివారం ఎపిసోడ్ భలే క్యూట్ గా సాగింది. ఈ వారం థీమ్ ఏంటంటే రెట్రో స్పెషల్ ... ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట. కంటెస్టెంట్స్ అంతా కూడా ఓల్డ్ కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ని ఇరగదీసేసారు. ఇక హోస్ట్ శ్రీముఖి ఐతే మహానటి గెటప్ లో అద్దిరిపోయింది. ఐతే ఒక విషయంలో బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. ఈ షోకి అందరూ జంటలుగా, జోడీలుగా ఎవరికీ నచ్చిన వాళ్ళను వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఈరోజు తాను కూడా తన రాజాను తెచ్చుకున్నట్టు చెప్పింది. "నా కలల రాకుమారుడిని, నా రాజాని చూపించే టైం వచ్చేసింది..రా రాజా" అని స్టేజి మీదకు ఇన్వైట్ చేసింది. ఇక ఈ నీతోనే డాన్స్ షోలో సోలో హోస్టింగ్ కాదు కో-హోస్టింగ్ అంటూ తన రాజాతో తెగ మురిసిపోతూ పరాచకాలు ఆడింది. "నా రాజా వారు వచ్చేసారు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి..రాధమ్మ ఎలా ఉంది మా ఈడు-జోడు" అని అడిగింది. "ఆయన పేరు రాజా..ఆయనకిష్టం కాజా..నాకోసం చేసాడు ఎంతో పూజ...అందుకే నేనన్నాను ఆజా ఆజా" అని శ్రీముఖి కవిత చెప్పేసరికి జడ్జెస్ అంతా నవ్వేశారు. 

ఇంతలో సంధ్య వచ్చి కాలితో కొట్టింది. దాంతో తరుణ్ మాష్టర్ కి కోపం వచ్చి "ఏ సంధ్య ఏంటది" అని అడిగారు.."అసలు ఎం జరుగుతోంది ఇక్కడా..ఒక 30 సెకన్లు అక్కడ వెయిట్ చేయమని చెప్పాను..ఇక్కడికొచ్చి ఎం చేస్తున్నావ్" అని సీరియస్ గా ఆ రాజాను అడిగింది. ఇంతలో సదా ఆ రాజా ఎవరో అర్ధం కాక "ఎవరు అతను" అని అడిగింది. "మా ఆయన నా పార్టనర్ బ్రిట్టో" అనేసరికి శ్రీముఖి నో అని అరుస్తూ కింద కూలబడిపోయింది. "నా రాజా నాకు దొరికాడు అనుకుంటే గడ్డం తీసేసిన బ్రిట్టోనా..ఇంత మోసం చేస్తావా..ఇప్పటి నుంచి సోలో హోస్టింగ్ మాత్రమే కో-హోస్టింగ్ లేదు" అని చెప్పేసింది శ్రీముఖి. "రాధమ్మ ఇంకా కొంచెం టైం పట్టేట్టు ఉంది నా పెళ్లి జరగాలంటే" అని తెగ బాధపడిపోయింది.