సొంత ఎమ్మెల్యేలను పందులన్న జగన్..?
Publish Date:Dec 1, 2017
Advertisement
కాలు జారితే తీసుకోగలం.. కానీ నోరు జారితే కష్టం అంటారు మన పెద్దలు. ఏ మాట ఎక్కడ మాట్లాడినా.. అది మంచిదైనా, చెడ్డదైనా ఎన్నో చెవులకు రిజిస్టర్ అయిపోతుంది. రాజకీయ నాయకులు ఎప్పుడు.. ఎవరితో ఏం మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఆ తర్వాత వచ్చే కంపు భరించడం కాకలు తీరిన పొలిటిషియన్స్ వల్లే కాలేదు. నువ్వా నేనా అంటూ కాలు దువ్వే శత్రువు గురించైనా సరే రాజకీయాలకి వచ్చే సరికి రెస్సాక్ట్‌తో మాట్లాడాలి. లేదంటే ఆ మాట అధికారాన్ని అందివ్వగలదు.. కుర్చీలోంచి లాగి కిందకు పడేయనుగలదు. అశాంతి, అసహనం, అసంతృప్తి మనిషి మనసులో కలకలం రేపుతాయి. అలాంటి వ్యక్తికి మాట మీద అదుపు తప్పి ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాదు. ఆ కోవలోకే వస్తారు వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంత కష్టపడ్డా కోరుకున్న లక్ష్యం దగ్గరకు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిలో అసహనం రోజురోజుకి పెరిగిపోతుంది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టడమో.. చిన్నప్పటి నుంచి కష్టపడిన నేపథ్యం లేకపోవడమో.. నడిచి నడిచి కాళ్లు నొప్పి పుడుతున్నాయో తెలియదు కానీ ఆయన సంయమనం కోల్పోతున్నారు. దీనికి తోడు నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు పార్టీ నేతలు తెలుగుదేశంలో చేరడంతో జగన్‌లో ఆవేశం కట్టలు తెంచుకొంది. నిన్నటి వరకు తనతో ఉన్నారన్న మాట కూడా మరచిపోయి వారిని నానా మాటలు అనేశారు. కాంట్రాక్టర్ల వద్ద తీసుకున్న అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలను గొర్రెలు, పశువుల్లా కాదు.. "పందుల్లా" కొనుగోలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. డబ్బు ఎరగా చూపారనో, మరేదో ఆశచూపి బుట్టలో వేసుకున్నారన్నా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ మరీ పందులతో పొల్చడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రతిపక్షం అన్నాకా అధికార పక్షంపై విమర్శలు చేయడం ఎక్కడైనా ఉంటుంది. అయితే జగన్ విషయానికి వచ్చేసరికి ఆయన హద్దులు ఏనాడో దాటేసినట్లు అనిపిస్తుంది. గతంలో ఇలా ఆవేశపడి నంద్యాలలో సీఎం చంద్రబాబును నడిరోడ్డుపైనా కాల్చేసినా ఫర్లేదని.. ఉరితీసినా తప్పులేదని కామెంట్ చేయడంతో జనం చీదరించుకున్న విషయాన్ని జగన్ మరచిపోయారా..? అంటూ సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు నెటిజన్లు. గెలుపుపై నానాటీకి జగన్‌లో భయం పట్టుకుందని.. అందుకే నోటికి ఎంత మాటొస్తే అంత అనేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
http://www.teluguone.com/news/content/ys-jaganmohan-reddy-45-79051.html





