Publish Date:Feb 28, 2026
తిరుమల లడ్డూలో 2019-24 మధ్య పెద్దఎత్తున కల్తీ జరిగిన మాట వాస్తవమని లోకేష్ చెప్పారు. ముంబయిలో ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026 పేరిట జరిగిన సదస్సులో మాట్లాడిన లోకేష్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వివిధరకాల కెమికల్ కాంపౌండ్స్ వినియోగించారన్నారు. కల్తీకారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిట్ నివేదిక ప్రకారం టిటిడి మాజీ చైర్మన్ తో సహా ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు.
ఇక తన రెడ్ బుక్ పై అడిగిన ప్రశ్నకు నారా లోకేష్.. జగన్ ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. అలా చేసిన వారి పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయి. లా బ్రేక్ చేసినవాళ్లు, అందుకు ప్రేరేపించిన రాజకీయనాయకులు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు అన్నీ ఉంటాయి. ఇక రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో తెలుస్తుందని లోకేష్ చెప్పారు.
సీఎం చంద్రబాబునాయుడు టఫ్ టాస్క్‌మాస్టర్, ఆయన ఇచ్చిన టాస్క్ పూర్తిచేయడమే మా పని అన్న లోకేష్. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల యంగ్ మ్యాన్. ఆయన ఇప్పటికీ పాతికేళ్ల యువకుడిలా పనిచేస్తారన్నారు. క్వాంటమ్ వ్యాలీపై మొదటిసారి నన్ను మీటింగ్‌కు పిలిచి దాని గురించి అడిగారు. నేను సెల్ ఫోన్ లో టేబుల్ కింద చాట్ జిపిటిలో సెర్చ్ చేస్తున్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వన్-పేజ్ నోట్ ఇవ్వాలని కోరారు. స్టాన్‌ఫోర్డ్ ఎంబిఎ చదివినా నాకు దానిపై అవగాహన లేదు. కానీ చంద్రబాబు నాయుడుకు ఉంది.ఆయన ఆలోచనలను అందుకోవడం చాలాకష్టం.
11 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 16 ఏళ్ల లోపువారికి ఏజ్-అప్రొప్రియేట్ కంటెంట్ మాత్రమే డిసెమినేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రాపర్ ఫ్రేమ్‌వర్క్ లేకపోవడం వల్ల దీనిని అమలుచేసేందుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనిపై మేము పేరెంట్స్, ప్లాట్‌ఫామ్ ప్లేయర్స్‌తో మాట్లాడుతున్నాము. దీనిపై మేం చేస్తున్న కసరత్తు 90 రోజుల్లో పూర్తవుతుందని లోకేష్ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wount-leave-responsible-adultrated-ghee-36-214786.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.