సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు..ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని మోదీ.!
Publish Date:Nov 8, 2026
Advertisement
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొడంగల్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రిని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా లేఖ రాశారు. భగవంతుడు రేవంత్‌రెడ్డికి ఆయురారోగ్యాలు, సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి, ప్రగతి, సమ్మిళిత వృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తున్న తరుణంలో.. తెలంగాణ అభివృద్ధికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి రాష్ట్రాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన జీవితం సంతోషం, ప్రశాంతత, సౌభాగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. ప్రధాని పంపిన లేఖను రేవంత్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆప్యాయతతో కూడిన సందేశానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయనకు ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరెన్నో ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. ఎన్సీపీ ఉపాధ్యక్షురాలు సుప్రియా సూలే సహా పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్యమంత్రికి జన్మదిన సందేశాలు పంపారు. 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రేవంత్‌రెడ్డి జన్మించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. మాజీ ఎంపీలు అనురాధ, గొడ్డేటి మాధవి ఓటమి.! [ CM Revanth Reddy Birthday Wishes, PM Narendra Modi, CM Chandrababu Naidu, Nara Lokesh, Gaddam Prasad Kumar, Minister seethakka, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-birthday-wishes-24-236569.html




