బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంతో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ యుద్ధంలో తమ దేశం జోక్యం చేసుకోబోదని కుండబద్దలు కొట్టేశారు. ఇది మా యుద్ధం కాదు, ఇందులోకి మమ్మల్ని లాగొదని విస్పష్టంగా చెప్పేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తి లేదన్నారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన కీర్ స్టార్మర్.. గత కొద్ది రోజులుగా ఇరాన్ యుద్ధంలో బ్రిటన్ పూర్తిస్థాయిలో పాల్గొనాలని ట్రంప్ బహిరంగంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విస్పష్ట ప్రకటన చేయడం విశేషం. మిత్రదేశాలు సహకరించకపోతే, అమెరికాను 'నాటో' కూటమి నుంచి తప్పిస్తానని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తమ ప్రభుత్వం బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది తప్ప, అమెరికా వంటి బాహ్య శక్తుల ఒత్తిడికి లోనై అనవసర పోరాటాల్లో దిగదని క్లియర్ కట్ గా చెప్పేశారు.
యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ముఖ్యంగా 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండా నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా అంతర్జాతీయ దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు.
ఇదే బ్రిటన్ నౌకాదళం కేవలం 'బొమ్మల' వంటిదని, వారి యుద్ధ విమాన వాహక నౌకలు పనికిరానివని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందిచిన కీర్ స్టార్మర్ నాటో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ కూటమి అని గుర్తు చేస్తూ.. దానికి బ్రిటన్ కట్టుబడి ఉంటుందన్నారు. నాటో కూటమి భవిష్యత్తుపై ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా, బ్రిటన్ మాత్రం తన సైనిక బలగాలను ఈ వివాదంలోకి పంపే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పడం అంతర్జాతీయంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-not-intervene-in-the-war-36-216543.html
పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వన్‌వే మార్గంలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు కేబీఆర్ పార్క్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను సడలించే అవకాశముంది.
పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మచిలీపట్నం, విజయవాడ్, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై .. ఎంత సేపూ గన్‌లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో రకరకాల ఈక్వేషన్లతో మావిగన్ కు కౌంటర్‌గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్‌ని ఒక రేంజ్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వలలో చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్‌పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది.
కువైట్‌లోని అత్యంత కీలకమైన మీనా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. శుక్రవారం జరిగిన ఈ అనూహ్య దాడితో ఒక్కసారిగా గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇప్పటికే వేల సంఖ్యలో బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన పెంటాగన్, సైనికులలో మానసిక ఒత్తిడిని ఇసుమంతైనా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తరువాత అగ్రరాజ్యంతో ట్రంప్ తీరుపట్ల ఆగ్రహం మరింత ఎక్కువ అవుతోంది.
అధికారిక లెక్కల్లో చూపని రూ.47,450లు నగదుతో పాటు రిజిస్ట్రేషన్ చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్‌ల ఆధీనంలో 204 అందజేయని రిజిస్టర్డ్ పత్రాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ గురువారం రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది.పబ్‌లో ఉన్నవారి కి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి యూరిన్ నమూనాలు సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వ హించారు.
హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్ర దేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ లకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
మూసి నది ప్రక్షాళన లో ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కార్తీక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ పరిసరాల్లో ముందస్తు అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ కార్యాలయాలపై దాడులు నిర్వహించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. బెంగళూరులో కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మరావతికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలం అయిన ఉద్దండరాయుని పాలెంలో జరిగిన సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఉద్దండరాయుని పాలెం చేరుకున్న చంద్రబాబు అక్కడ రాజథానికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.