ఆదివారమే సెలవు దినంగా ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న కథ ఇదే..!

Publish Date:Feb 28, 2026

Advertisement


ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది.  భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు  ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని,  ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే..

కార్మిక హక్కులు..

బ్రిటిష్ పాలన కాలంలో  ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని  వెనుక ఒక  కథ ఉంది.


ఆదివారం సెలవు వెనుక కథ..

ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు.  ఎందుకంటే  బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు.

7ఏళ్ల పోరాటం..

కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881,  1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం,  లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది.   జూన్ 10, 1890న, భారతదేశంలో  ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది.

ఆదివారం సెలవు వెనుక అసలు కారణం..

ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన,  ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి.

ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు.

భారతీయ సంస్కృతి,  హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి,  కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి,  పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి.

1700 సంవత్సరాల చరిత్ర..

ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది  భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్,  తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది.  వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.

                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.