రివర్స్ పేరెంటింగ్ అంటే ఏంటి?

Publish Date:Feb 27, 2026

Advertisement


వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది. అదే రివర్స్ పేరెంటింగ్. దీనిని చైనా వంటి దేశాల నుండి అమెరికా వరకు తల్లిదండ్రులు ఫాలో అవుతున్నారట. రివర్స్ పేరెంటింగ్ అనే పదం కొత్తగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా కుటుంబాలలో స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు పేరెంటింగ్ నిపుణులు. అసలు రివర్స్ పేరెంటింగ్ అంటే ఏమిటి? దీని వల్ల కుటుంబంలో మంచి జరుగుుతుందా? లేక చెడు జరుగుతుందా? పూర్తీగా తెలుసుకుంటే..

రివర్స్ పేరెంటింగ్ అంటే ఏమిటి?


సాధారణంగా పేరెంటింగ్ లో పిల్లలకు తల్లిదండ్రులు మార్గ నిర్దేశకత్వం చేస్తుంటారు. కానీ రివర్స్ పేరెంటింగ్ లో ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తాడు.  పిల్లలు తల్లిదండ్రులకు అన్నీ వివరిస్తారు.  లేదా నిర్ణయం తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇందులో రెండు విధాలు ఉన్నాయట..

ఎమోషనల్ క్యారెక్టర్స్ చేంజ్..

 పిల్లవాడు తల్లిదండ్రుల ఎమోషనల్ కేరింగ్ ను తాను తీసుకుంటాడు. ఇది ఎమోషనల్ క్యారెక్టర్స్ చేంజ్ అని పిలవబడుతోంది.

డిజిటల్ లేదా లైఫ్ స్టైల్ మార్గదర్శకత్వం..

 పిల్లవాడు తల్లిదండ్రులకు టెక్నాలజీ, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మొదలైన వాటి గురించి నేర్పించడం జరుగుతుంది. దీన్ని డిజిటల్ లేదా లైఫ్ స్టైల్ మార్గదర్శకత్వం అని అంటున్నారు.

రివర్స్ పేరెంటింగ్ లో..

పిల్లవాడు తల్లిదండ్రుల మధ్య గొడవలను పరిష్కరిస్తాడు.  ఆర్థిక నిర్ణయాలపై  తన సలహా ఇస్తుంటాడు.  డిజిటల్ ప్రపంచం నేటి పిల్లలకు బాగా పరిచయం. కానీ తల్లిదండ్రులకు డిజిటల్ ప్రపంచం పరిచయం ఉండకపోవచ్చు.  అలాంటి వారికి పిల్లలు అర్థమయ్యేలా చెబుతారు.

రివర్స్ పెరెంటింగ్ లో పిల్లలు వారి బాధ్యతను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటే అది బానే ఉంటుంది. కానీ పిల్లలు తమ బాల్యాన్ని పణంగా పెట్టి రివర్స్ పేరెంటింగ్ లో మాత్రమే నిండిపోతే అది వారికి,  వారి భవిష్యత్తుకు సమస్యగా మారుతుందని పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు.

రివర్స్ పేరెంటింగ్ ప్రయోజనాలు..

బాధ్యత..

పిల్లలు పెద్దల పాత్రను పోషించినప్పుడు లేదా బాధ్యతలను స్వీకరించినప్పుడు వారు త్వరగా పరిణతి చెందుతారు.


బలమైన భావోద్వేగ బంధం..

ఒకరి బాధ్యతలను ఒకరు అర్థం చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు,  పిల్లల మధ్య అవగాహన పెరుగుతుంది.


డిజిటల్ అంతరాన్ని తగ్గించడం..

పిల్లలు టెక్నాలజీని సులువుగా నేర్చుకుంటారు,  వారి కుటుంబంలో కూడా వాటిని నేర్పడం వల్ల పిల్లలు  తల్లిదండ్రులతో  డిజిటల్‌గా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇది  అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

రివర్స్ పేరెంటింగ్ నష్టాలు..

చిన్న వయసులోనే అధిక బాధ్యత పిల్లలలో ఒత్తిడిని పెంచుతుంది.


బాల్యం కోల్పోవడం

ఆటలాడే వయసులో బాధ్యతలు స్వీకరించడం భావోద్వేగ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది.


పాత్ర గందరగోళం

బాధ్యత,  హోదాలో మార్పులు కుటుంబంలో అధికారం,  బాధ్యత యొక్క సరిహద్దులను అస్పష్టం చేస్తాయి.

                                           *రూపశ్రీ

By
en-us Political News

  
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.