ఎంత దగ్గరి వ్యక్తులకైనా సరే.. ఈ విషయాలు అస్సలు చెప్పకండి..

Publish Date:Oct 26, 2026

Advertisement

ఎంత దగ్గరి వ్యక్తులకైనా సరే.. ఈ విషయాలు అస్సలు చెప్పకండి..


మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆయన చెప్పిన విషయాలు చాణక్య నీతి పేరుతో ఎంతో ప్రాచుర్యం పొందాయి.    కాలం ఎంత మారినా చాణక్య నీతిలో చెప్పిన సూత్రాలు నేటి ఆధునిక కాలంలో కూడా అందరికీ వర్తించేలాగా, అందరూ ఆచరించదగినవిగా ఉంటాయి.  ఇంకా చెప్పాలంటే.. మనిషి స్వభావాన్ని ఆయన వేల ఏళ్ల కిందటే ఖచ్చితంగా అంచనా వేసి ఈ విషయాలన్నీ చెప్పగలిగారు.  
 
సాధారణంగా మనకు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం కలిగినా ముందుగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అనుకుంటాం. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు లేదా చాలా సన్నిహితులు అయినప్పటికీ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణక్య  హెచ్చరిస్తున్నారు. కొన్ని  విషయాలను ఎంత  దగ్గరి వ్యక్తులకు కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచితేనే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండగలమని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయాలు ఏంటో  వివరంగా తెలుసుకుంటే..

ఆర్థిక  ఇబ్బందులు..

వ్యాపారంలో నష్టం వచ్చినా లేక ఎవరి వద్దనైనా అప్పులపాలైనా ఆ విషయాలను కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉండటమే మంచిదని చాణక్యుడు అభిప్రాయపడ్డారు. ఈ రకమైన ఆర్థిక సమస్యల గురించి ముందే చెబితే వారు అనవసరంగా ఆందోళన చెందుతారు. దీనివల్ల ఇంటి వాతావరణం కూడా నిరాశానిస్పృహలతో నిండిపోతుంది. ఒకవేళ  నిజంగా ఇంట్లో వారి ఆర్థిక సహాయం లేదా సలహా అవసరమైతే తప్ప మిగతా సమయాల్లో  ఆర్థిక సమస్యలను ఎవరికీ చెప్పకుండా ఉండటమే చాలా మంచిది.

 భార్యాభర్తల  వ్యక్తిగత గొడవలు..

వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు లేదా గొడవలు రావడం సర్వసాధారణం. అయితే ఈ వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబంలోని ఇతర సభ్యులకూ లేదా బయటి వ్యక్తులకూ చెప్పకూడదు. ఇలాంటి విషయాలను అందరి ముందు చర్చించడం వల్ల మీపై ఇతరులకు ఉండే గౌరవం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇతరులు మీ సమస్యలను చూసి పైకి సానుభూతి చూపినప్పటికీ, వెనుక నుంచి మీ గురించి చులకనగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మీ సమస్యలను మీరే ప్రశాంతంగా కూర్చుని పరిష్కరించుకోవడం మంచిది.

ఆఫీస్ లో  అవమానాలు లేదా ఉద్యోగ సమస్యలు..

వృత్తి జీవితంలో ఎవరికైనా కొన్నిసార్లు పై అధికారుల నుంచి తిట్లు లేదా సహోద్యోగుల నుంచి అవమానాలు ఎదురుకావచ్చు. ఇలాంటి విషయాలను ఇంట్లో వాళ్లతో పంచుకుంటే వారు మీ గురించి అనవసరంగా బాధపడతారు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళ దృష్టిలో మీ విలువ క్రమేపీ తగ్గిపోతుంది. మిమ్మల్ని బలహీనుడిగా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తిపరమైన విషయాలను ఆఫీస్ లోనే వదిలేయడం మంచిది.

 మనసులోని బలహీనతలు , భయాలు..

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత లేదా భయం ఉంటుంది. అయితే మనకున్న ఆ బలహీనతలను ఎవరికీ, కనీసం దగ్గరి కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా గొడవలు లేదా వాదనలు జరిగితే కొందరు వ్యక్తులు మన బలహీనతనే మనకు వ్యతిరేకంగా వాడుకుని మనల్ని మరింత మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు.

చేయబోయే  పనులు లేదా లక్ష్యాలు..

ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, పెద్ద లక్ష్యాన్ని సాధించాలనుకున్నా ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదు. పని పూర్తి కాకముందే అందరికీ ఆ విషయం చెబితే ఇతరుల అనవసరమైన సలహాలు, సందేహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అందుకే మీ విజయాన్ని ముందుగా సాధించి చూపించిన తర్వాతే పదిమందితో పంచుకోవడం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది.

                                                                                                                                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మాంసం కూరలను తలదన్నే రుచితో, రైతన్నల బలానికి రహస్యమైన పచ్చి కూరగాయల రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. సులభమైన పదార్థాలతో విలేజ్ స్టైల్ పచ్చడి తయారీ విధానం.
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ నేటికాలంలో చదువు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కుగా మారింది
జపాన్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హిదేకి వాడా రచించిన ది 80 ఇయర్ వాల్ పుస్తకం ఆధారంగా వృద్ధుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం అందించిన 44 విలువైన సూచనలు, ఆరోగ్య చిట్కాలు మరియు విశేషాల పూర్తి సమాచారం.
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
సాయంత్రం పూట వేడి వేడిగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ కోసం సింపుల్ టిప్స్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.