భాగస్వామిని వదిలేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లలో ఈ లక్షణాలు ఉంటాయి..!

Publish Date:Oct 30, 2024

Advertisement

 


పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను చాలా మార్చేస్తుంది.  ఇద్దరు వేర్వేరు వ్యక్తులు భార్యాభర్తలు అయ్యాక  వారిద్దరి జీవితాలు, వారి సంతోషాలు ఒకరి పట్ల మరొకరు ప్రవర్తన,  ఒకరితో మరొకరు నడుచుకునే విధానం మీద ఆధారపడి ఉంటాయి. పెళ్లైన కొత్తలో ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. కానీ భాగస్వామి కాలక్రమేణా మారుతూ ఉంటే.. అది అతను మీ నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నాడని అర్థం  కావచ్చు.  అతని ప్రవర్తనలో ఏదో తేడాను గమనించడం ప్రారంభిస్తే, అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.
ప్రేమ, గౌరవం,  నమ్మకం అనే పునాదిపై ఆధారపడిన సంబంధం వైవాహిక బంధం. భాగస్వాములిద్దరూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకున్నంత కాలం మాత్రమే ఈ బంధం బలంగా ఉంటుంది. కానీ వీటిలో ఏవైనా బలహీనపడటం మొదలైతే ఆ సంబంధం విచ్ఛిన్నం అంచుకు చేరుకుంటుంది. భాగస్వామిని వదిలేసే ఉద్దేశ్యం ఉండేవారిలో కొన్ని లక్షణాలు,  ప్రవర్తనా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.  అవేంటో తెలుసుకుంటే..

ఇంటరెస్ట్ లేకపోవడం..

 భాగస్వామి మీతో ఇంతకు ముందులాగా ఓపెన్ గా మాట్లాడకపోతే లేదా మీరు చెప్పే దానిపై ఆసక్తి చూపకపోతే అది వారికి మీ మీద ఆసక్తి పోయిందని చెప్పడానికి ఒక  సంకేతం. ఎప్పుడూ భార్యతో మాట్లాడటానికి లేదా భార్యతో సమయం గడపడానికి వాయిదాలు వేయడం,  తప్పించుకోవడం,  బిజీగా ఉన్నానని సాకులు చెప్పడం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం,  మునుపటిలాగా మాట్లాడటానికి, ప్రేమగా ఉండటానికి  ఆసక్తి చూపడం లేదని తెలుపుతుంది.

శారీరక,  భావోద్వేగాలు..

 భాగస్వామి మునుపటిలాగా శ్రద్ధ వహించడం లేదని ఎప్పుడైనా అనిపించిందా?  అతను భార్యకు  దగ్గరగా రావడానికి,  చేయి పట్టుకోవడానికి శారీరకంగా దగ్గరగా ఉండటానికి ఇష్టపడకుండా సంకోచంతో ఉంటున్నాడా?  వీటికి అవును అనే సమాధానం వస్తే..  అతను   మానసికంగా,  శారీరకంగా దూరం అవుతున్నాడనడానికి ఇది సంకేతం.

గొడవ..

ప్రేమ,  పరస్పర అవగాహన సంబంధంలో ముఖ్యమైనవి. కానీ  భాగస్వామి ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం చేస్తుంటే.. అది అతను లోలోపల ఇబ్బంది పడుతున్నారని సూచిస్తుంది. కొన్నిసార్లు ఈ గొడవల  ద్వారా అతను  వేరు వెళ్లిపోవాలని ప్రయత్నించడం కూడా జరగవచ్చు.

భవిష్యత్తు ప్రణాళిక..

 భాగస్వామి తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో భార్యను చేర్చకపోతే అది ఆందోళన కలిగించే విషయం కావచ్చు. అతను అకస్మాత్తుగా తన కెరీర్, ప్రయాణ ప్రణాళికలు లేదా ఇతర విషయాలకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటే అతను ఈ సంబంధాన్ని కొనసాగించే మూడ్‌లో లేడని అర్థం చేసుకోవచ్చు.

సామాజిక జీవితంలో దూరం..

 భాగస్వామి గతంలో మిమ్మల్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపి, ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడుతూ  తన స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే ఇది కూడా ఒక వార్నింగ్ సిగ్నల్  కావచ్చు.  అతను తన జీవితంలో మీ ఉనికిని నెమ్మదిగా తగ్గించుకుంటున్నాడని సూచిస్తుంది.

 ఏమి చేయాలి?

 సంబంధంలో పైన చెప్పుకున్న మార్పులను  గమనించినట్లయితే, ఆందోళన చెందడానికి బదులుగా, ఇద్దరూ కలిసి మాట్లాడటానికి మార్గాన్ని వెతకాలి.  భాగస్వామితో ఓపెన్ గా  మాట్లాడాలి.   అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా అడిగినప్పుడు అతను  ఒత్తిడికి లోనవ్వవచ్చు.   పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్టు అనిపిస్తే రిలేషన్ షిప్ కౌన్సెలర్ నుండి సహాయం తీసుకోవడం కూడా మంచి ఎంపిక కావచ్చు. సంబంధాన్ని కాపాడుకోవడానికి భాగస్వాములిద్దరి ప్రయత్నాలు చేయడం అవసరం. ఇరిద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ సంబంధం మళ్ళీ బలపడుతుంది.

                                            *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.