మహావీరుడిని స్మరించుకుందాం!!

Publish Date:Apr 12, 2022

Advertisement

సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషిచేసినవారు ఎందరో ఉన్నారు. నిజనికి ఈ మార్గాన్ని చెప్పే మతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో జైన మతం ఒకటి. ఆధినాధుడు లేదా వృషభనాథుడు స్థాపించిన ఈ జైన మతానికి ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు. వారిలో చివరివాడు, ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈ మహావీరుడు. ఈయన కాలంలోనే జైన మతం వ్యాప్తి చెందింది.


వర్థమానుడు….. మహావీరుడు!!


వర్థమానుడు మహావీరుడు ఇద్దరూ ఒకటే. బీహార్ లో వైశాలి అనే నగరానికి సమీపంలో కుండ అనే గ్రామంలో క్రీ.పూ 599 సంవత్సరంలో క్షత్రీయ కుటుంబంలో మహారాజు సిద్ధార్థుడుమహారాణి త్రిషలకు  ఒక పిల్లవాడు పుట్టాడు.  ఆ పిల్లవాడికి వర్థమానుడు అని పేరు పెట్టారు. తల్లిదండ్రుల దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన వర్తమానుడు తన ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఈయన భార్య పేరు యశోధర. ఈయనకు ఒక కూతురు పుట్టిన తరువాత తన ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకున్నారు. 


సుదీర్ఘ తపస్సు!!


ఈయన దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆ పన్నెండేళ్ల కాలంలో ఆయనలో ఎన్నో రకాల ఆత్మానుభూతులు కలిగాయి.  సాలవృక్షం కింద ఈయన తపస్సు చేసిన ఈయన సర్వవ్యాపకత్వమైన జ్ఞానాన్ని సంపాదించారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అందరికీ జ్ఞానాన్ని బోధించారు. అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో ఈయన తన తత్వాలను ప్రచారం చేసాడు.


త్రిరత్నాలు!! పంచవ్రతాలు!!


సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మూడింటిని త్రిరత్నాలు అని అంటారు. ఈ మూడు మనిషి జీవితం మోక్షం సాధించడానికి మార్గాలు అని వర్తమాన మహావీరుడు ప్రతిపాదించాడు. సరైన విధంగా దేన్నైనా చూడటం(చూడటం అంటే ఇక్కడ దృష్టికోణం అని అర్థం), సరైన జ్ఞానం, సరైన జీవితం ఇవన్నీ మనిషి మోక్షసాధనకు మూలం అని చెప్పారు.


ఇకపోతే పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనే దానిని కలిపి పంచవ్రతాలు రూపొందించాడు. 


పంచవ్రతాలు మనిషి జీవితంలో పాటించడం ఎంతో ముఖ్యమని, వాటిని పాటిస్తూ త్రిరత్నాలలో జీవిస్తే మనిషి మోక్షానికి పాత్రుడు అవుతాడని వర్తమాన మహావీరుడు చెప్పాడు.


అలాగే ఈయన ఆ కాలానికే బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించాడు. పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, నిష్ఠగా తపస్సు చేస్తే ఎలాంటి వారు అయినా మోక్షాన్ని సాధించవచ్చని తెలియజేసారు.


ఆదర్శ మార్గం!!


అహింస అనే మార్గాన్ని ఆదర్శప్రాయంగా స్వీకరించి దాన్ని ఆచరించి బానిసత్వంలో ఇరుక్కుపోయిన భారతదేశానికి స్వతంత్ర్యాన్ని తీసుకురావడానికి కృషి చేసిన వారిలో మహాత్మ గాంధీ ఒకరు. ఈయన స్వయంగా వర్తమాన మహావీరుడి భోధనలకు ప్రభావితమై తన జీవితాంతం అహింసా  మార్గాన్ని అనుసరించారు. 


ఈయన ఒక్కరే కాదు. వర్థమహా వీరుడి మార్గంలో  గాంధీ గారు, గాంధీ గారి మార్గంలో వెళ్లి ఆంధ్రరాష్ట్రాన్ని సాధించి పెట్టిన మరొకరు పొట్టిశ్రీరాములు గారు. 


ఇలా వర్తమాన మహావీరుడి బోధనలను మార్గదర్శకంగా తీసుకుని ధన్యులు అయినవాళ్ళు ఎందరో. అలాంటి వర్తమాన మహావీరుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవాలి. ఆయన మార్గాలను వీలున్నంతవరకు పాటించాలి.


                                    ◆ వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.