ఒంటిమిట్ట కల్యాణ మహోత్సవం!!

Publish Date:Apr 13, 2022

Advertisement


కోదండరాముడంట అమ్మలాలా, కౌసల్య పుత్రుడంట అమ్మలాల అని పాడుతుంటే రామభక్తుల మనసు రమణీయంగా ఉంటుంది. చేతిలో కోదండం అనే ధనస్సు పట్టుకుని ఉంటాడు కాబట్టి ఈయన కోదండ రాముడయ్యాడని తెలుస్తుంది. 


రామాయణంలో రామలక్ష్మణులు చిన్నగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం వాళ్లను తీసుకెళ్లడం. యాగరక్షణ తరువాత సీతమ్మ స్వయంవరానికి వెళ్లి అక్కడ శివదనస్సు విరిచి సీతమ్మను పెళ్లాడటం అందరికీ తెలిసిందే. అయితే అదంతా జరిగిపోయిన తరువాత కూడా రామలక్ష్మణులు ఒకసారి యాగరక్షణ కోసం వెళ్లినట్టు ఓ పురాణ కథనం ఉంది.

దుష్టశిక్షణకై నడక!!

మృకండుడు, శృంగుడు అని ఇద్దరు మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్లిద్దరూ ఒక యాగం చేస్తుంటే రాక్షసులు ఆ యాగాన్ని అడ్డుకుంటూ ఆ మహర్షులను బాధపెట్టేవాళ్ళు. ఆ మహర్షులు ఇద్దరూ రాముడి దగ్గరకు వెళ్లి "రామా!! నువ్వు చిన్నతనంలోనే విశ్వామిత్రుడితో వెళ్లి యాగరక్షణ చేసావు కదా!! ఇప్పుడు మాక్కూడా అలాంటి రక్షణ కావాలి. మేము చేసే యాగం ఎలాంటి అడ్డంకులతో ఆగిపోకుండా నువ్వు  వచ్చి కాపాడు" అని అడగగా,  సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లిన ఆ రామచంద్రుడు యాగాన్ని రక్షించాడు. దానికి గుర్తుగా మృకండుడు, శృంగుడు ఇద్దరూ ఆ సీతారామ లక్ష్మణులను ఏకశిలలో చెక్కించారు. జాంబవంతుడు ఈ ఆలయంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసాడు.

హనుమంతుడు లేని ఆలయం!!

రాముడి బంటు హనుమంతుడు. రామనామం జరిగే ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. రాముడున్న ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. కానీ ఈ ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు లేని ఆలయం ఇదొక్కటేనని చెబుతారు. కారణం గురించి ఆలోచిస్తే రాముడికి, హనుమంతుడికి పరిచయం జరగకమునుపు ఇదంతా జరిగి ఉంటుందని పెద్దలు, చరిత్రకారులు చెబుతారు.

విశేషాలు!!

ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఎంత చరిత్ర ఉందొ, అంతకు మించి విశేషాలు ఉన్నాయి. ఈ కోదండ రాముడిని స్తుతిస్తూ "అయ్యల తిప్పరాజు" శ్రీ రఘువీర శతకాన్ని రచించి ఈ కోదండరాముడికే అంకితమిచ్చాడు. ఈయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అయ్యలారాజు రామభద్రుడి తాతగారు కావడం గొప్ప అంశం. 

బమ్మెరపోతన తను రచించిన భాగవతాన్ని ఈ కోదండరాముడికే అంకితం ఇచ్చాడు. అలాగే వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి ఈ కోదండరాముడి దగ్గరే మందరం అనే పేరుతో వ్యాఖ్యానం రాసాడు.  ఈయన కొబ్బరి చిప్పలో బిక్షం ఎత్తి వచ్చిన డబ్బుతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని, దేవతా మూర్తులకు ఆభరణాలు చేయించడానికి, రామసేవ కుటీరాన్ని నిర్మించడానికి ఉపయోగించాడని చెబుతారు. ఇంకా ఎంతోమంది కవులు ఈ ఏకశిలానగరంలో రామునికి తమ కవిత్వంతో అర్చన చేసుకున్నారని చెబుతారు.

బ్రహ్మోత్సవాల విశిష్టత!!

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. అన్నీకంటే ముఖ్యమైనది సీతారాముల కల్యాణం. పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో ఈ కల్యాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి రోజు వెన్నెలలో ఎందుకు జరుపుతారు అనే ప్రశ్నకు సమాధానంగా ఒక పురాణం కథనం ఉంది. 

సాగర మథనం తరువాత మహాలక్ష్మిని నారాయణుడు భార్యగా స్వీకరించాడు. వీరి కల్యాణం పగటి సమయంలో జరుగుతుండటంతో చంద్రుడు తన బాధను మహాలక్ష్మీకి చేబుతాడట. నేను మీ కల్యాణం చూడలేకపోతున్నాను అని. అపుడు మహాలక్ష్మికి తమ్ముడిని తృప్తి పరచడానికి ఒంటిమిట్ట ఆలయంలో పౌర్ణమి వెలుగులో రాత్రిపూట మా కల్యాణం జరుగుతుంది చూసి ఆనందించు అని చెబుతుందట. అప్పటి నుండి పౌర్ణమి సమయంలో ఎంతో అద్భుతంగా జరుగుతూనే ఉంది ఈ కల్యాణం.

రాష్ట్రాలు వేరైపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా ప్రకటించి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణంకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తోంది.

ఏకాశిలానగరంలో పౌర్ణమి వెన్నెలలో సీతారాముల కల్యాణం, ఆ తరువాత రథోత్సవం చూసిరండి, ఆ రాముడి గురించి ఆలకించినా ఆలపించినా మైమరిచిపోతారు.


                                ◆వెంకటేష్ పువ్వాడ.


 

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.