ధర్మరాజ దశమి సందేశం!!

Publish Date:Apr 11, 2022

Advertisement

యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా, దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక, పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్లిన జీవులే అవుతారు. అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించినవాడు లేడు. అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు. 


ఏమిటీ ధర్మరాజ దశమి!!


చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే  మరణభయం తొలగిపోతుందని పెద్దలు, మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ ధర్మరాజ దశమి రోజు జరుగుతుంది. 


ఎవరు ఈ నచికేతుడు??


పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు. 


ఏమిటీ నచికేతుడి కథ!!


వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తనదగ్గరున్న ఆవులలో పలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు. అది నచికేతుడికి నచ్చలేదు "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి?? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అన్నాడు నచికేతుడు. 


కొడుకు ఏదో పిల్ల చేష్టతో అలా అంటున్నాడనుకుని నన్ను విసిగించద్దు అన్నాడు వాజశ్రవుడు.


అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చిరవరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అన్నాడు. ఆ తరువాత తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు 


కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్నమాట జరగకుంటే మంచిదికాదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు. యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో. నీకు మూడు వరాలు ఇస్తాను అన్నాడు.


నచికేతుడి మూడు వరాలు!!


యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా 


1.నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు.


తరువాత


స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు. అంటాడు.


మూడవ కోరికగా 


మరణం తరువాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు.


మొదటి దానికి యముడు సరేనంటాడు.


రెండవదానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు. (స్వర్గం అంటే భయం లేని స్థితి అంటారు ఇందులో)


మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు అంటాడు యముడు. కానీ నచికేతుడు మొండిపట్టు పట్టడంతో  బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు. అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి తొణకడు.


ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదనేది ఇందుకే. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది.


స్వామి వివేకానంద అంటాడు. నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా??

                                         ◆వెంకటేష్ పువ్వాడ.

 

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.