ప్రశాంత్ కిశోర్‌తో "ప్రశాంతంగా" కాంగ్రెస్

Publish Date:Aug 3, 2016

Advertisement

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. అది కూడా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి వేదికగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఆమె వెంట పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో బైకుల మీద పార్టీ జెండాలు ఊపుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ప్రచారపర్వానికి వారణాసి నుంచి తెరలేపడం ద్వారా మోడీపైనే కాంగ్రెస్ గురిపెట్టినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత వ్యూహత్మకంగా..పకడ్భంధీగా మోడీ కోటపై కాంగ్రెస్ ఫోకస్ చేయడం వెనుక ఉన్నది ఒక్కడు.. ఆ ఒక్కడే ప్రశాంత్ కిశోర్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపు వెనుక, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిశ్ కుమార్ వెనుక..నిలిచి వారి విజయంలో ప్రశాంత్ కీలక పాత్ర పోషించాడు.

 

గుజరాత్‌లో మోడీ అభివృద్ధి చరిష్మాకు తోడు..ఎన్నికల సమయంలో పదునైన వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ రచించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేదా విపక్షాల విమర్శలకు ప్రశాంత్ ధీటైన వ్యూహాలు పన్నారు. మోడీని ఛాయ్ వాలా అనటంతో..బీజేపీ ఛాయ్ పే చర్చాతో కౌంటర్ ఇచ్చింది. అలాగే నితీశ్ విజయంలో ప్రధాన సూత్రదారి ప్రశాంత్ కిశోర్. ప్రశాంత్ ఎటు వైపు పనిచేస్తే..అటు వైపే విజయం ఉండటం..ఒక పెద్ద యుద్దం ముందుండటంతో వరుస పరాజయాలతో చిక్కి..శల్యమైన కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం..పోల్ మేనేజ్‌మెంట్‌లో మొనగాడిగా పేరున్న ప్రశాంత్ కిశోర్‌ను అద్దెకు తెచ్చుకుంది. వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రశాంత్ తన పని మొదలుపెట్టాడు. యూపీలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే బ్రాహ్మణ వర్గాన్ని మెప్పించటం కోసం ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన షీలాదీక్షిత్‌ను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పట్టుబట్టి నిలబెట్టారు ప్రశాంత్.

 

వయసు మళ్లిన ఆమెను చూసి జనం ఓట్లు వేస్తారా..? అందుకే తనలోని మేధావిని బయటకు తీశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా స్లోగన్‌ను తయారుచేశారు. ఆ స్లోగన్ ఏంటంటే "మేరీ జీవన్ కా ఏక్ హీ సప్నా..ఉత్తరప్రదేశ్‌ కో ఢిల్లీ జైసా బనానా" దీనిని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తే "ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీలా మార్చాలన్నదే నా జీవితంలోని ఆఖరి కోరిక " దీన్ని బట్టి చూస్తే మనోడు ఎంత జాదూగాడో అర్థమవుతుంది. వయసు మళ్లిన వ్యక్తికి ఆఖరి కోరికగా అభివృద్ధిని చేర్చి దానితో సెంటిమెంట్‌ను రగల్చాలన్నదే ఆయన వ్యూహం. ఇక ఓబీసీగా ఉన్న రాజ్‌బబ్బర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించడంతో ఆ వర్గం బలాన్ని కూడగట్టారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో బీజేపీ వ్యూహకర్తగా వారణాసిలో అమలు చేసిన రోడ్‌షో వ్యూహన్ని సోనియా గాంధీ చేత వర్కవుట్ చేయించారు. విమానం దిగిన దగ్గరి నుంచి స్ట్రాటజీతో వెళ్లారు ప్రశాంత్...విమానం దిగి దిగగానే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం ద్వారా సోనియా దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . జ్వరంతో ఉన్నా అలాగే ఓపిక పట్టి రోడ్‌షోలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు సోనియా.

 

ఈ పరిణామాలతో కమలనాథులు ఆత్మరక్షణలో పడ్డారు. మొన్నటికి మొన్న మాయవతిపై నోరుజారడం, అటు గుజరాత్‌లో దళితులపై దాడులను నియంత్రించలేక అప్రతిష్ట మూటగట్టుకుని దాదాపు దళితులకు దూరమయ్యే పరిస్థితిని కమలం కోరి తెచ్చుకుంది. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే అద్భుతమే జరగాలన్నారు. గతంలో ఇలాంటి అద్భుతాలు జరిగాయని, ఈసారి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో తమ ప్రత్యర్థులకు అలాంటి అద్భుతాలు జరిగాయని, ఈసారి తమ వంతు వస్తుందన్న ఆశ ఉందని అన్నారు. మరి ఆయన మాటల్లోని అంతర్యాం ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగకతప్పదు.

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.