జగన్ తీరు: వైసీపీ బేజారు.!

Publish Date:Nov 6, 2026

Advertisement

రాజకీయ పార్టీల మనుగడకు సమర్ధ నాయకత్వం అవసరం. నాయకుడు ముందుండి పార్టీని నడిపిస్తేనే పార్టీ ముందుకు సాగుతుంది. అంతే కానీ, నాయకుడు  ప్యాలెస్ లో కూర్చుని కొరడాతో అదిరిస్తాననే అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఆ పార్టీకి పురోగతి ఉండదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అదే.  అంతే కాదు.. నాయకుడుకి పార్టీ జెండామోసే కార్యకర్తలకు దూరం ఎంతగా  పెరిగితే,  పార్టీ అంతగా నష్ట పోతుంది.

ఇప్పుడు వైసీపీ గురించి చెప్పుకోవాలంటే నాయకుడికి సమర్ధతా లేదు.. ఆయనది కార్యకర్తలతో మమేకమయ్యే తీరు కాదు. ఔను నిజం. వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు నేను ఆదేశిస్తాను, మీరు పాటించండి అన్న చందంగా ఉంటుంది. ఆ కారణంగానే  ఆయన అటు ప్రజలతోనూ, ఇటు పార్టీ కార్యకర్తలతోనూ మమేకం కాలేకపోతున్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ కు అందుబాటులో, ప్రజలకు దగ్గరగా మెలగాల్సిన జగన్ ప్యాలెస్ కే పరిమితమౌతున్నారు. దీంతో పార్టీ నేతలూ, కార్యకర్తలూ అయోమయంలో పడిపోతున్నారు. 

సమకాలీన రాజకీయ నాయకులలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది ఓ విలక్షణ శైలి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటారు. కాదంటే ఒప్పుకోరు. ఒక్కోసారి అదే కుందేటికి ఐదు కాళ్లనడానికీ ఇసుమంతైనా సందేహించరు. తాను ఏది చెప్పినా అందరూ విని తీరాలంటారు. నమ్మి తీరాలంటారు. వైసీపీలో  ఆయన కోటరీ జగన్ రెడ్డి తీరును సరిగ్గా అర్ధం చేసుకుంది. దీంతో ఆయన ఓటములను కూడా ప్రత్యర్థుల పరాజయాలుగా అభివర్ణిస్తూ.. ఓ ప్రత్యేక శైలిలో కథనాలు వండి వారుస్తుంటారు. ఆ కథనాలను ప్రసారం చేయడానికీ, ప్రచురించడానికీ, ప్రచారం చేయడానికి జగన్ రెడ్డికి సొంత మీడియా, సోషల్ మీడియా వింగ్ లు ఉన్నాయి. 

సరే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత నుంచి జగన్మోహన్ రెడ్డి సందర్భం ఉన్నా లేకున్నా  2029 ఎన్నికలలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. తాను సీఎంను అవుతాను అన్నమాటే వల్లె వేస్తున్నారు. ఆయన మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. జనం ఆయనను నమ్మి మరోసారి అధికారం అప్పగిస్తే దానినీ ఎవరూ తప్పుపట్టరు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  

ఇది కూడా చదవండి: జగనన్నా నిన్ను నమ్మలేమన్నా!

మామూలుగా జగన్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే.. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ గు ప్రతి గురువారం వచ్చి.. ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి, ఏపీకి వచ్చిన పనైపోయిందన్నట్లుగా బెంగళూరు ఉడాయించేస్తుంటారు. ఎప్పుడో పరామర్శలకో, ఓదార్పు యాత్రలకో మాత్రం ఈ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు ఉంటాయి. అంతే అంతకు మించి మిగతాదంతా సేమ్ టూ సేమ్. 

అదే విధంగా ఆయన గురువారం (నవంబర్ 5) ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల తీరును తూర్పారపట్టారు. అధికార తెలుగుదేశం కూటమి దౌర్జన్యాలకు పాల్పడిందంటూ దుయ్యబట్టారు. తమ పార్టీ వారిని ఓటు వేయకుండా అడ్డుకుందన్నారు. అంతే పరిషత్ ఎన్నికల సందర్భంగా పులివెందుల వంటి కొన్ని చోట్ల జరిగిన అరకొర హింసాత్మక సంఘటనలను జాతీయ స్థాయి సమస్యలుగా అభివర్ణించి మీడియా సమావేశం ముగించి బెంగళూరు వెళ్లిపోయారు.  నాయకుడి తీరు ఈ రీతిగా ఉంటే వైసీపీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆ పార్టీ శ్రేణుల్లోనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోవడమో, రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీలలోకి జంప్ చేయడమో, చేయడానికి ప్రయత్నాలలోనో ఉన్నారు. 

మీకు నచ్చవచ్చు:  జగన్‌కి సీఎం అపాయింట్‌మెంట్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

కంగ్రాట్స్ టీమ్ సీబీఎన్ అంటూ ట్వీట్: పుర పోరులో ఓటమిపై జగన్ అక్కసు.!

[YS Jagan politics Conine Palace, Distance, Party Cader, Pressmeets, Troll Material, Telugu One]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.