ఇండియా కూటమి: పొత్తులూ, పొరపొచ్చాలు.. యూపీలో కాంగ్రెస్ ఎస్పీ సర్దుపాట్లు.!

Publish Date:Nov 26, 2026

Advertisement

 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం పీటముడి పడినట్లు కనిపిస్తోంది. 2027 ఫిబ్రవరి, మార్చి  మధ్య జరగనున్న యూపీ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్,  సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరు పార్టీల మధ్య సీట్ల సంఖ్యపై పీటముడి కొనసాగుతోంది. అయితే ఈ లోగానే సమాజ్‌వాదీ పార్టీ ఏకపక్షంగా ఐదు స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను   ప్రకటించడంతో ఇరు పక్షాల మధ్యా పొరపొచ్చాలు బహిర్గతమయ్యాయి.   ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 403 నియోజకవర్గాలకు గాను కనీసం నూట పాతిక స్థానాలలో  పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందన్న కారణాన్ని చూపుతూ.. ఆ రెండు స్థానాలకు అదనంగా మరో 24 సీట్లు కలిపి మొత్తం 26 స్థానాలను మాత్రమే కేటాయిస్తామని ఎస్పీ అంటోంది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పూర్తిగా తిరస్కరిస్తుండగా, తాము ప్రతిపాదించిన సంఖ్య కంటే పెద్దగా వెనక్కి తగ్గేందుకు ఎస్పీ అంగీకరించడంలేదు. మొత్తంగా ఇరువురూ పట్టువిడుపులు ప్రదర్శించకపోవడంతో రెండు దఫాలు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది.

ఇదే సమయంలో ఎస్పీ విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించిన ఐదు నియోజకవర్గాల అంశం ఇరు పార్టీల మధ్యా అగాధాన్ని మరింత పెంచింది.  ఎస్పీ ప్రకటించిన ఐదు స్థానాలలో  కాంగ్రెస్ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ స్థానం కూడా ఉండటంతో పీటముడి మరింత బిగిసింది. ఓ వైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ ఏకపక్షంగా ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయవర్గాలలో ఆసక్తి వ్యక్తమౌతోంది.  

ఈ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ అత్యంత ఘాటుగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని  విమర్శించారు. సీట్ల కోసం తాము దేబిరించడం లేదనీ, సీట్లు అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్లం కాదనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పొత్తు చర్చలు నడుపుతూనే, మరోవైపు అభ్యర్థుల జాబితాలను విడుదల చేయడం చూస్తుంటే సీట్ల సర్దుబాటుపై ఎస్పీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇక సీట్ల సర్దుబాటుపై తదుపరి చర్చలకు హాజరుకావాలా లేదా అనే విషయం పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ కూడా ఎస్పీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్య జరుగుతున్న సీట్ల చర్చలు పూర్తయ్యే వరకు సమాజ్‌వాదీ పార్టీ వేచి ఉండాల్సిందన్నారు. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు ఎస్పీ 311 స్థానాల్లో, కాంగ్రెస్ 114 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ 47, కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లోనే గెలిచి అధికారానికి దూరమయ్యాయి. దీంతో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్లే నష్టపోయామని భావించిన ఎస్పీ, 2022లో ఒంటరిగా పోటీ చేసి 111 స్థానాలు గెలుచుకోగా, విడిగా పోటీ చేసిన కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది.

ఇది కూడా చదవండి: గాంధీ కుటుంబం: ఐదు తరాల వరకు ప్రధాని కాలేరు..ఎస్పీ నేత సెటైర్లు.!

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య సమన్వయం లోపించి ఓట్లు చీలిపోతే,   భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇరు పార్టీల అగ్ర నాయకత్వం జోక్యం చేసుకుని చర్చలను మళ్లీ పట్టాలెక్కిస్తుందా లేదా అనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఢిల్లీ స్థాయిలో జరిగే సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు దక్కకపోతే ఒంటరిగా బరిలోకి దిగాలన్న ఒత్తిడి రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి పెరుగుతుండగా, విపక్ష ఓట్లు చీలకుండా పొత్తును నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది.  2027 ఎన్నికల సమరానికి ముందు ఈ సీట్ల పంచాయితీ ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాలు, ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:   కాంగ్రెస్, ఎస్పీ పార్టీల పొత్తు... షీలా దీక్షిత్ ఔట్..​

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై లేటెస్ట్ సర్వే.. యూపీలో సంచలనమేనా? 


[UP Assembly Elections, SP Congress, Alliance, Seatsharing,  Uttar Pradesh politics, Rift, TeluguOne]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.