జీఎస్టీ..2000 To 2016

Publish Date:Aug 4, 2016

Advertisement

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంతో దేశ ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించినట్లైంది. ప్రస్తుత పన్నుల వ్యవస్థలో అనేకానేక సంక్లిష్టతలకు, సమస్యలకు పరిష్కారం చూపగల విశిష్ట సంస్కరణలకు ప్రతి రూపమే జీఎస్టీ. కానీ దీనికి ఏకాభిప్రాయం కుదరడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం అనేక షరతులు, సవరణలు ప్రతిపాదించి బిల్లు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి..ఎలాగైనా జీఎస్టీని పట్టాలపైకి ఎక్కించాలనుకున్న ఎన్‌డీఏ సవరణలకు తలొగ్గి పట్టుదలతో బిల్లును నెగ్గించుకొంది. ఈ క్రమంలో జీఎస్టీ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం.

 

మనం ఏదైనా వస్తువు కొన్నపుడు బిల్లు గమనిస్తే ఎమ్మార్పీ ధరతో పాటు వ్యాట్, ఇతర పన్నుల కింద భారీగా పన్నులు కనిపిస్తాయి. ఎమ్మార్పీలోనే ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. పరోక్ష పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వసూలు చేయడంతో చిక్కులతో పాటు కొన్నిసార్లు ఒకే పన్ను రెండు సార్లు కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం వినియోగదారుడు వస్తువు ధరలో 25 నుంచి 30 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. ఈ భారాన్ని ముందుగానే గ్రహించిన కేంద్రం 1994లో వస్తు సేవల పన్నుపై ఆలోచన చేసింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి ప్రభుత్వం సాధికారిక కమిటిని నియమించటం ద్వారా జీఎస్‌‌టీపై చర్చను ఆరంభించింది. ఈ కమిటీకి అప్పటి పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అసీమ్ దాస్‌గుప్తా నాయకత్వం వహించారు. అనంతరం 2003లో పరోక్ష పన్నుల అమలుపై కేల్కర్ కమిటీని నియమించారు..తన నివేదికలో వస్తు సేవల పన్ను ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించింది ఈ కమిటీ.

 

2006లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో జీఎస్‌‌టీ ప్రతిపాదన చేశారు, 2007లో జీఎస్‌టీ అమలుకు కార్యాచరణను రూపొందించే బాధ్యత రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి అప్పగించారు. జీఎస్‌టీని 2011 ఏప్రిల్‌లో ప్రవేశపెడతామని 2010 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలిపారు. చెప్పిన విధంగానే జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లును 2011 లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీన్ని పార్లమెంట్ స్థాయి సంఘం పరిశీలనకు పంపారు. అయితే 15వ లోక్‌సభ మార్చిలో రద్దుకావటంతో బిల్లుకు కాలం చెల్లింది. 2012లో సాధికార కమిటీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జీఎస్‌టీ రూపకల్పన కమిటీ ఏర్పాటు చేశారు.

 

2013లో జీఎస్‌టీ రూపకల్పన కమిటీ తన నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా బిల్లులో కొన్ని సవరణలకు సాధికార కమిటీ సిపారసు చేసింది. 2014 డిసెంబర్ 19న రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, 2015 మే 6న సభ ఆమోదం పొందింది. అనంతరం రాజ్యసభ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. ఆ కమిటీ అదే ఏడాది జూలై 22న నివేదికను సమర్పించింది. 2016 ఆగస్టు 3న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా..అదే రోజు సభ ఆమోదం పొందింది. 

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.