మసకబారిన బొత్స ప్రతిష్ఠ: ఉత్తరాంధ్రలో ఇక ఉత్సవ విగ్రహమేనా?

Publish Date:Nov 20, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నేత అయిన బొత్స సత్యన్నారాయణ ప్రతిష్ఠ మసకబారిందా? సొంత జిల్లాలోనే పట్టు నిలుపుకోవడంలో విఫలమైన బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా? సొంత జిల్లాలోనే ఆయన ఉత్సవ విగ్రహంగా మారారా? అంటే వైసీపీ నేతలే ఔనని అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలు బొత్స ప్రతిష్టను బాగా మసకబార్చాయి. ఇక తాజాగా గురువారం (నవంబర్ 19) జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 

ఈ ఫలితాలు   బొత్స సత్యనారాయణకు వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ఇబ్బందికరంగా పరిణమించాయి.    ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, గురువారం (నవంబర్ 19) చేతులు ఎత్తే పద్ధతి ద్వారా మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. వైసీపీకి బలం ఉందని భావించిన చోట్ల సైతం టీడీపీ అభ్యర్థులు ఎంపీపీ పీఠాలను దక్కించుకోవడం బొత్సకు తేరుకోలేని షాక్ గా మారింది. మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లోనూ టీడీపీ ఆధిక్యం సాధించడం ఆయన రాజకీయ పలుకుబడికి చెల్లుచీటి రాసినట్లుగా అయ్యిందని సొంత పార్టీ శ్రేణులే అంటున్నాయి.  మరోవైపు..  బొత్సకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బొంపల్లి వెంకట్రావు వైసీపీకి రాజీనామా చేయడం ఆయన ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. 

అలాగే ఇదే నెలలో జరిగిన  ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందిన వెంకట్రావు,  పార్టీని వీడారు. తనకు వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ అన్యాయం చేశారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది.   గతంలో తన కుమార్తె అనూషను గెలిపించుకోలేకపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్న సొంత పార్టీ నేతలు, తాజాగా సొంత జిల్లాలో ఎంపీపీ స్థానాలను నిలుపుకోలేకపోవడం బొత్సకు సొంత జిల్లాలోనే ఆదరణ కరవైందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. 

ఆరంభం నుంచి విజయనగరం జిల్లాపై బలమైన పట్టు కలిగిన నేతగా పేరున్న బొత్స ఇలాకాలోనే ఇలాంటి ఫలితాలు రావడం వైసీపీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేసింది.   రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే, బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో వైసీపీకి ఎదురైన ఈ పరాజయం పార్టీ శ్రేణుల్లో  అసంతృప్తికి కారణమైంది. క్షేత్రస్థాయిలో  మారిన, నేతల మధ్య ఏర్పడిన విభేదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయన్న చర్చ పోరందుకుంది. 

ఇది కూడా చదవండి:   వైసీపీలో బొత్స సినిమా అయిపోయిందా?

 మండల పరిషత్ పీఠాలు చేజారిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో వైసీపీ తన బలాన్ని ఎలా పునర్నిర్మించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అసంతృప్తి నేతలను బుజ్జగించడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై నాయకత్వం దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.   రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల పాలన, మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల దృష్టి నిలవనుంది. 

కాగా ఈ పరాజయం వైసీపీలో బొత్స భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బొత్స అనుచరులు వరుసగా పార్టీని వీడుతుండటం, ఆయన వ్యతిరేకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండటంతో జిల్లాలో ఆయనకు ఇక గడ్డు కాలమేనని అంటున్నారు. ఈ తాజా పరాజయంతో  జిల్లా వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మీకు నచ్చవచ్చు:  బొత్స ఇలాకాలో వైసీపీ జీరో: వలసలు, సస్పెన్షన్లు.. అసలేం జరుగుతోంది.?

జనసేన గూటికి బొత్స కన్ ఫర్మేనా?

[Botsa Satyanarayana, Pride Diminish, Vizianagaram MPP elections, Cheepurupalli Defeat,  Bompalli Venkatrao, Resign, TeluguOne]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.