Publish Date:Mar 16, 2026
ఖమ్మంలో ఓ గృహప్రవేశ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్ కు వెళ్లిన ఓ మహిళ బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసింది. సుస్మిత అనే మహిళ బంధువుల గృహప్రవేశ వేడుకకు వెళ్లింది. ఆ ఫంక్షన్ లో ఫొటోలు దిగుతుండగా గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. అప్పటి వరకూ ఆనందంగా, ఉత్సాహంగా తిరుగుతున్న యువతి ఒక్కసారిగా గుండెపోటుతో కన్నుమూయడం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను విషాదంలో ముంచేసింది.
హఠాత్ హర్ట్ స్ట్రోక్స్ రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి కాలంలో ఇలా హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణాలు సంభవిస్తున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణలో బహిరంగ వేదికలపై, సామాజిక కార్యక్రమాల్లో గుండెపోటుతో కుప్పకూలిపోయి వ్యక్తులు మరణించిన పలు సంఘటనలు జరిగాయి. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం వల్లనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రజలకు ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఇటువంటి మరణాలు ఎత్తి చూపుతున్నాయి. తరచూ హెల్త్ టెస్టులు చేయించుకోవడం, లైఫ్ స్టైల్ ను ఆరోగ్యవంతంగా జీవించేలా మార్చుకోవడం, ఆహారపు అలవాట్లను సమీక్షించుకోవడం అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు మరణాల పెరుగుదల ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తున్నది ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలి. వయస్సుతో సంబంధం లేకుండా మూడు పదుల వయస్సు వారు కూడా హార్ట్ స్ట్రోక్ తో మరణించిన సంఘటనలు సంభవిస్తున్నాయి. అందుకే యువత కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
చిన్న వయస్సు కదా.. ఏం భయం లేదు అనుకోవడానికి అవకాశం లేదు. ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇక ప్రభుత్వం కూడా ప్రజారోగ్యం విషయంలో చర్యలు తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఆరోగ్య విద్యను అందించాలి. గుండెపోటు మరణాలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి, గుండెపోటు మరణాలకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తగిన నిధులు కేటాయించాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tragedy-at-housewarming-ceremony-36-215615.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.