Publish Date:Mar 16, 2026
వాతావరణ మార్పు.. రాష్ట్రంలో ఒకే సమయంలో ఒక ప్రాంతంలో ఎండ, మరో ప్వారాంతంలో వాన విస్మయం, ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విలక్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని ఓ ప్రాంతం వానలు, మరో ప్రాంతం భానుడి భుగభగలతో నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు భిన్న వాతావరణం ఉంది. ఇక వివరాల్లోకి వెడితే.. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో మార్చి రెండో వారంలోనే రోళ్లు పగిలే ఎండలు మండిపోతున్నాయి.
అనంతపురం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం (మార్చి 16) జిల్లాలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడి, ఉక్కపోతతో సీమ జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి ఆరంభంలోనే.. అంటే వేసవి మొదటిలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుంటే రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు ఇంకెంత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదే సమయంలో కోస్తా జిల్లాలలో వాతావరణం చల్లగా మారింది. వాతావరణ శాఖ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలులు, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మంగళవారం(మార్చి 17) వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల పిడుగుపాటుకు కూడా అవకాశం ఉందని హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rains-and-heat-in-andhrapradesh-36-215618.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.