ఐస్‌క్రీంని బట్టి మనస్తత్వం

Publish Date:Apr 3, 2019

Advertisement

 

మీకు ఏ ఐస్‌క్రీం అంటే ఇష్టం? అని అడిగితే ఠక్కున వెనీలా అనో స్ట్రాబెర్రీ అనో జవాబు చెప్పేస్తాం. కానీ సరదాగా ఇష్టపడిన ఆ రుచి వెనక మన మనస్తత్వం దాగి ఉందంటే నమ్మగలరా! కొన్ని రుచులను మనం ప్రత్యేకంగా ఇష్టపడటానికి కారణం మన మెదడులో ఉండే limbic lobe అనే భాగమే కారణం. ఇదే భాగం మన మనస్తత్వాన్ని కూడా నిర్దేశిస్తుందని చెబుతారు. కాబట్టి మనం ఎలాంటి పదార్థాలను ఇష్టపడతామో అన్న విషయం ద్వారా మన వనస్తత్వం ఎలాంటిదో కూడా పసిగట్టేయవచ్చునట! కావాలంటే మీరే పోల్చి చూసుకోండి…


వెనీలా

వెనీలా అతి సాధారణమైన ఫ్లేవర్‌. మీరు కూడా అంతే నిరాడంబరంగా ఉంటారు. జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తారు. ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టకాలంలో నమ్మదగిన మనిషిగా గుర్తింపు పొందుతారు. ఎంత నిదానంగా కనిపించినా... అవసరం అయినప్పుడు మీ మనసులో మాటని నిర్మోహమాటంగా చెప్పేయగలరు. ఆపదని ఎదుర్కొనేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడగలరు.


చాక్లెట్‌

మనుషులని గెల్చుకోవడంలో మిమ్మల్ని మించినవారు ఉండదరు. పార్టీలన్నా, ప్రయాణాలన్నా మీకు మహా సరదా! ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ప్రేమించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో మిమ్మల్ని మీరూ ప్రేమించుకుంటారు. జీవితాన్ని అనుభవిస్తూనే, కెరీర్‌లో దూసుకుపోతారు. మీ జీవితంలో అటు విలాసాలకీ, ఇటు వినోదాలకీ కొదవే ఉండదు.


స్ట్రాబెర్రీ

మీలో సహనం చాలా ఎక్కువ. ఒక బంధాన్ని నిలుపుకొనేందుకు, జీవితంలో నిరంతరం ముందుకు వెళ్లేందుకైనా ఆ సహనమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతర్ముఖులుగా (introvert) మీరు నిత్యం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. ఒకోసారి ఆ ఆలోచనలే మీలో లేనిపోని భయాలను రేకెత్తిస్తాయి. ఆత్మన్యూనతో కుంగిపోయేలా చేస్తాయి.


పిస్తా

మీది నలుగురూ నడిచే బాట కాదు. నలుగురూ మాట్లాడే మాట కాదు. మీకంటూ ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరి వైపూ మొగ్గు చూపని, ఎవరి ప్రభావానికీ లొంగని ప్రత్యేకత మీది. అదే భిన్నత్వం వల్ల స్నేహితులు మీరంటే ఇష్టపడతారు. ఆ భిన్నత్వం ఒకోసారి మిమ్మల్ని కొరకరాని కొయ్యగా మారుస్తుంది. ఇతరుల కంటే వైవిధ్యంగా ఉండాలనే తపన ఒకోసారి అసహనానికి దారితీస్తుంది.


బటర్‌ స్కాచ్‌

మీరు ఏదన్నా పని చేస్తే, వేలెత్తి చూపించేందుకు ఏమీ ఉండదు. మీ జీవితం కూడా అలాగే ఉండాలనుకుంటారు. సంప్రదాయాలను అనుసరిస్తూ గౌరవాన్ని పొందుతారు. మీ గమ్యాన్ని చేరుకునేందుకు ఒక ప్రణాళికను ఏర్పరుచుకుని, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా... మీరు ఏర్పరుచుకున్న విలువలని అంగుళం కూడా సడలించరు.

ఇవే కాదండోయ్‌! బనానా, మింట్, ఆల్మండ్, కాఫీ- ఇలా రకరకాల ఐస్‌ క్రీం ఫ్లేవర్లు ఉన్నాయి కానీ... మనకి ఎక్కువగా దొరికే రుచుల గురించే పైన చెప్పుకొన్నాం. వాటిలో ఎంతవరకు నిజం ఉందో మీరే చెప్పాలి. 

- నిర్జర.

By
en-us Political News

  
జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సమాజంలో లేదా పని చేసే చోట కొందరు వ్యక్తులు మన ఎదుగుదలను చూసి ఓర్వలేక శత్రువులుగా మారుతుంటారు.
పండుగ వేళల్లో ఇష్టమైన వంటకాలు ఎక్కువగా లాగించడం వల్ల తీవ్రమైన ఎసిడిటీ మరియు ఛాతీలో మంట వస్తుందా? ఎసిడిటీకి కారణమయ్యే ఆహార పొరపాట్లు మరియు వాటిని నివారించే సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్‌వాచ్‌లో గుండె వేగం సాధారణంగా ఉన్నప్పటికీ పక్షవాతం (Stroke) వచ్చే అవకాశం ఉందా? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు, స్ట్రోక్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
టీ మరియు కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? రీసెంట్ స్టడీ రిపోర్ట్ ప్రకారం టీ, కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు మరియు ఎముకల ఆరోగ్యంపై పడే ప్రభావం పూర్తి వివరాలు తెలుసుకోండి.
క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ప్రోటీన్లు కంతులను సులువుగా గుర్తించేలా చేసినప్పటికీ, రోగనిరోధక దాడి నుంచి ఎలా తప్పించుకుంటున్నాయో తెలిపే తాజా వైద్య పరిశోధనా విశేషాలు.
చలిగాలులు వీచినప్పుడు కళ్ల నుంచి నీరు ఎందుకు కారుతుంది? ఇది డ్రై ఐ సమస్య లేదా అలర్జీనా అనే పూర్తి వివరాలు, కారణాలు మరియు నివారణ మార్గాలను తెలుసుకోండి.
పిల్లలతో అనుబంధం అనేది కేవలం రక్త సంబంధానికి మాత్రమే పరిమితం కాదు. అది పరస్పర నమ్మకం, భావోద్వేగాల కలయికపై ఆధారపడి ఉంటుంది.
ఉదయం నిద్రలేవగానే పరగడుపున నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, జీర్ణక్రియ మెరుగుపడటం, హైడ్రేషన్ మరియు కిడ్నీల ఆరోగ్యంపై నిపుణుల సలహాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
మధుమేహాన్ని సహజంగా నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం కానుగ పువ్వు పొడి గురించిన పూర్తి వివరాలు. టైప్ 1, టైప్ 2 షుగర్ లెవల్స్‌ను తగ్గించే ఈ ఇంటి చిట్కా ప్రయోజనాలు, తయారుచేసే విధానం తెలుసుకోండి.
బెండకాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? షుగర్, కొలెస్ట్రాల్, జీర్ణశక్తిపై డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు మరియు తయారుచేసే సరైన విధానం ఇక్కడ తెలుసుకోండి.
శరీరంపై కొవ్వు గడ్డలు లేదా లిపోమా సమస్యతో బాధపడుతున్నారా? సర్జరీ లేకుండా సహజమైన ఇంటి చిట్కాలు, ఆహారపు అలవాట్లు మరియు ఆయుర్వేద మార్గాల ద్వారా కొవ్వు గడ్డలను ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.