వివాహం తర్వాత మగవాళ్లు  పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట..!

Publish Date:May 13, 2025

Advertisement


వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.  ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  వివాహం తరువాత సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలి అంటే  మగవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇంతకీ అవేంటో ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే..

వివాహం తర్వాత పురుషులు చేయకూడని పనులు..

వివాహం అయిన మగవాళ్లు ఎక్కడికైనా వెళ్ళేముందు ఆలోచించాలి.  తొందర పడి సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకోవడం వల్ల అతని జీవితంలో నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోకుండా ఇతరులతో వెళ్లడం చాలా నష్టాలకు దారి తీస్తుంది.

వివాహం అయిన తరువాత మగవాళ్లు బయటి మహిళల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయ్యే మగవాళ్లకు వారి వైవాహిక జీవితంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.  ఇది అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది.  అలాంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం అంతా ప్రభావితమవుతుంది.

మనిషికి సంతృప్తి అనేది లభించడం చాలా కష్టం.  ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని అనుకుంటూనే ఉంటాడు. వివాహం అయిన మగవాళ్లు ఉన్న వాటితో తృప్తి చెందలేకపోతే  ఆ వ్యక్తి అశాంతికి లోనవుతాడు. ఈ అసంతృప్తి వైవాహిక జీవితంలో కూడా చాలా నష్టాలు,  సమస్యలకు కారణం అవుతుంది.

నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ వివాహం అయిన మగవాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది.  భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు భార్యకు తప్పకుండా చెప్పాలి.

                                *రూపశ్రీ.
 

By
en-us Political News

  
భారతీయులు ఎక్కువగా ఉపయోగించే దుంప కూరగాయలలో బంగాళదుంపలు ముఖ్యమైనవి.
ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ముఖ్యమైన మొదటి దశ ఉందంటే అది కెరీర్ కు సంబంధించిన విషయమే అయ్యుంటుంది.
ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం అనేది సహజమైన భావోద్వేగ ప్రక్రియ. కానీ ఈ ప్రేమ "అతిగా", "అనుదినం అతి ఆసక్తితో", లేదా "అత్యంత అనుభూతులతో" కొనసాగితే, కొన్ని సానుకూలతలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం.
క్రమ శిక్షణ ప్రతి వ్యక్తి జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది.
వేసవికాలంలో తాహతు ఉన్నవారు ఏసీ ఏర్పాటు చేయించుకోవడం,  చల్లని గదులలో సేద తీరడం చాలా సాధారణ విషయం.
పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిచయం లేకుండా పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరూ ఒకటై జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది.
సమాజంలో చాలా వరకు మధ్యతరగతి,దిగు తరగతి కుటుంబాలే ఉంటాయి.
తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.
 ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం.
నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి....
ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.