Publish Date:Mar 11, 2026
తెలంగాణలో కొత్త డీజీపీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర నూతన పోలీస్ బాస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో ఆనంద్‌ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపింది. ఈ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు సౌమ్యమిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖాగోయల్ పేర్లు ఉన్నాయి. వీరిలో సీనియారిటీ పరంగా ముందున్న సీవీ ఆనంద్‌కే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
కొత్త డీజీపీ ఎంపికపై ఢిల్లీలో యూపీఎస్సీ ఎంప్యానెల్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ కూడా సభ్యుడిగా ఉండటంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఎస్సీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నాలుగు పేర్లను పరిశీలించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముగ్గురి పేర్లతో తుది జాబితాను రాష్ట్రానికి పంపిస్తుంది. ఆ జాబితాలోని ఒకరిని తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తుంది.
డీజీపీ నియామకానికి సంబంధించి ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ ఇటీవల తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు లేఖలు పంపి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. సీనియారిటీ, అనుభవం దృష్ట్యా సీవీ ఆనంద్‌నే రాష్ట్ర తదుపరి డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telanganas-new-dgp-36-215325.html
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
చిన్నపాటి సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యుడికి జీఎస్టీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చారు.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు.
గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్‌లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.