Publish Date:Dec 14, 2025
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సఫారీ సేన.. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. 118 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమ్ ఇండియా 15.5 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంలో 5 టీ ట్వంటీల సిరీస్ లో టీమ్ ఇండియా 2-1 ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది.
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో భారత బౌలర్లు చెలరేగారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. అసాధారణ ప్రదర్శన చేసింది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా విజృంభించి సౌతాఫ్రికాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఆ తరువాత ఛేదనలొ భారత్ మూడు వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌కు కఠినమైన పరిస్థితులు ఉన్నాయన్నాడు. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. తాము వరుసగా ఐదు వికెట్లు కోల్పో యామన్న మార్కరమ్, భారత బౌలర్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలన్నాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమన్న మార్కరమ్.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని ఎదుర్కో వడానికి.. తిరిగి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన మార్గాలు కనుగొనాలని అభిప్రాయపడ్డాడు. టీమ్ ఇండియా బౌలర్లు తమకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదనీ, తాను ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, తాను ఇంకాస్త దూకుడు పెంచి 140-150 పరుగుల స్కోరు జట్టుకు అందించి ఉంటే.. మ్యాచ్ రసవత్తరంగా జరిగేదన్నాడు. డెత్ ఓవర్లలో తాను ఔటైన బంతి భారీ షాట్ కొట్టగలిగేదేనని, ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనుకునే బౌలర్‌పై మాత్రమే విరుచుకుపడాలని తెలిపాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ప్రొటీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి సఫారీల బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఛేదనకు దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-out-play-south-africa-36-210991.html
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసుకున్న మహ్మద్ షమీ ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. గతంలో ఏడుగురు బౌలర్లు తొలి బంతికే వికెట్ తీసిన ఘనత మూడు సార్లు సాధించారు.
సాధారణంగా గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవడం అనేది యువతకు ఒక కల. భారీ ప్యాకేజీలు, సమాజంలో గుర్తింపు.. ఉండే అలాంటి ఉద్యోగాన్ని వదులు కోవడానికి సాధారణంగా ఎవరైనా వెనుకాడుతారు. హర్షిత్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ గూగుల్ లో చేస్తున్న సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగానికి ముగింపు పలికాడు.
భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో బలమైన సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.48 గంటల సమయంలో టెర్నాటే ద్వీపానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది.
.అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తాము పశ్చిమాసియాలో దిగ్గజ కంపెనీలపై దాడులకు తెగబడతామని ఇరాన్ హెచ్చరించిన 24 గంటల వ్యవధిలో ఈ దాడి జరిగింది.
జియాగూడకు చెందిన అరవై ఏళ్ల బావుద్దీన్ ఓ చిన్న కిళ్లీ కొట్టు యజమానిగా మాత్రమే అందరికీ తెలుసు.. కానీ ఈజీ మనీ కోసం అక్రమ మార్గం ఎంచుకున్నాడు. ధూల్‌పేట్‌లో గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో సైకిల్‌పై తిరుగుతూ విక్రయించేవాడు. గత ఆరునెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగించాడు.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉంది. 23 రిఫైనరీలలో సుమారుగా ఏడాదికి 258.7 మిలియన్ మెట్రిక్ టన్నుల శుద్ధి సామర్థ్యం ఉంది. ఒక ప్రధాన ప్రపంచ శుద్ధి కేంద్రంగా, పెట్రోలియం ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా, భారతదేశం 2030 నాటికి సామర్థ్యాన్ని 310 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ తాబేలు 1832లో జన్మించింది. అనంతరం 1882లో హిందూ మహాసముద్రం ప్రాంతం నుంచి సెయింట్ హెలెనాకు దీనిని తరలించారు. 1930లలో అప్పటి గవర్నర్ సర్ స్పెన్సర్ డేవిస్ ఈ తాబేలకు జోనాథన్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి గవర్నర్ అధికారిక నివాసమైన ప్లాంటేషన్ హౌస్ ప్రాంగణంలోనే జోనాథన్ నివసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించడానికి ముందు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఒంటిమిట్ట కల్యాణ వేదికపై ప్రకృతి, సాంకేతికత ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఆకాశంలో నిండు పున్నమి చంద్రుడు వెన్నెల ధారలతో జగన్మాతను, జగదభిరాముడిని అభిషేకిస్తున్నట్లుగా తోచింది. అదే సమయంలో వేదిక అంతటా అమర్చిన రంగురంగుల విద్యుత్ కాంతులు ఒంటిమిట్ట పరిసరాలను ఒక రంగుల లోకంలా మార్చేశాయి.
హెర్మూజ్ జలసంధి గుండా జరిగే చమరు రవాణా అమెరికాకు పెద్దగా అవసరం లేదన్న ఆయన.. తాము ఆ మార్గం గుండా కేవలం ఒక శాతం చమురునే పొందుతున్నట్లు గుర్తు చేశారు.
అప్పట్లో సంజీవ్ గోయెంకా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం తరువాత సంజీవ్ గొయెంకా మళ్లీ అదే సీన్ రిపీట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తి లేదన్నారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన కీర్ స్టార్మర్.. గత కొద్ది రోజులుగా ఇరాన్ యుద్ధంలో బ్రిటన్ పూర్తిస్థాయిలో పాల్గొనాలని ట్రంప్ బహిరంగంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విస్పష్ట ప్రకటన చేయడం విశేషం.
పాలన మార్పు, రహస్య చర్యలు మరియు భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఒక కాలక్రమ పరిశీలన