ఆత్మప్రభోదాను సారం ఆ టెక్కీ ఏం చేశాడంటే?
Publish Date:Apr 2, 2026
Advertisement
ఆత్మప్రభోదానుసారం ఓటింగ్ అంటూ సాధారణంగా రాజకీయాలలో వింటుంటాం. అది కూడా అన్ని రకాలుగా ఆలోచించి జరిగే ఓటింగ్ అది. కానీ అద్భుతమైన జీతం, విలాసవంతమైన జీవితం, సమాజంలో గుర్తింపు ఉన్న ఉద్యోగాన్ని ఆత్మప్రభోదానుసారం వదిలేసుకుంటున్నాను అనే వాళ్లు అత్యంత అరుదుగా ఉంటారు. బెంగళూరుకు చెందిన హర్షిత్ శర్మ అనే ఉద్యోగి మాత్రం ఎంత జీతం ఉంటే మాత్రం మనసు అంగీకరించనప్పుడు చేయడమెందుకు? అంటే ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ముందు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. ఆ పోస్టు సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ..హర్షిత్ శర్మ పోస్టు చేసిన వీడియోలో ఏమన్నాడంటే.. ఇన్నాళ్లూ తానొక రోబోలా బతికానన్నాడు. టెన్త్ కంప్లీట్ చేసిన తరువాత సైన్స్ తీసుకోవడం, జేఈఈ రాసి ఇంజనీరింగ్‌లో చేరడం, ఆపై ఐటీ ఉద్యోగం సంపాదించడం.. ఇదంతా కేవలం ఇతరుల అంచనాలు అందుకోవడం కోసమే జరిగిందనీ, తన ఆసక్తి ఇసుమంతైనా ఉందా లేదా అన్నది తెలియనే లేదని పేర్కొన్నాడు హర్షిత్. ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే.. తన లైఫ్ అంతా గీసిన గీత దాటని ఒక లైన్ ఫాలోయింగ్ రోబో లో గడిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు గూగుల్ ఉద్యోగం వదిలేయాలన్నది ఏదో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రం కాదనీ, గత కొన్నేళ్లుగా తనాు సంపాదించిన సొమ్ములో అధికభాగం పొదుపు చేసి.. మూడు నాలుగేళ్ల ఎటువంటి ఆదాయం లేకపోయినా కుటుంబ అవసరాలకు ఎటువంటి ఢోకా లేదన్న ధీమా వచ్చిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుననానని పేర్కొన్నారు. ఇహ తాను తనకు ఇష్టమైన రంగంలో ముందుకు సాగేందుకు తన పొదుపు ధీమా ఇచ్చిందన్నారు. ప్రస్తుతానికి రొటీన్ పనులు కాకుండా, ఇన్నాళ్లూ వాయిదా వేసుకున్న హాబీలు మరియు ఆశయాలను నెరవేర్చుకుంటానని ఆ వీడియోలో హర్షిత్ పేర్కొన్నారు. 2027 నాటికి తన నిర్ణయం సరైనదే అని గర్వంగా చెప్పుకునేలా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఇక నెటిజనులైతే హర్షిత్ వ్యక్తిత్వాన్నీ, ధైర్యాన్ని వేనోళ్ల పొడుగుతున్నారు. కార్పొరేట్ ఒత్తిడిలో బతుకుతున్న ఎందరికో హర్షిత్ స్ఫూర్తిగా నిలు స్తాడని అంటున్నారు.
అది కూడా అలాంటి ఇలాంటి సంస్థలో ఉద్యోగాన్ని కాదు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో ఉన్నతోద్యోగాన్ని ఆత్మ ప్రబోధాను సారం అంటూ తృణ ప్రాయంగా వదిలేశాడు. సాధారణంగా గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవడం అనేది యువతకు ఒక కల. భారీ ప్యాకేజీలు, సమాజంలో గుర్తింపు.. ఉండే అలాంటి ఉద్యోగాన్ని వదులు కోవడానికి సాధారణంగా ఎవరైనా వెనుకాడుతారు. హర్షిత్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ గూగుల్ లో చేస్తున్న సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగానికి ముగింపు పలికాడు.
http://www.teluguone.com/news/content/bengaluru-techie-leaces-job-as-per-selfenlightenment-36-216565.html





