జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా.. సెమీస్ ఆశలు సజీవం
Publish Date:Feb 26, 2026
Advertisement
టి 20 వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. జింబాబ్వేతో గురువారం (ఫిబ్రవరి 26) జరిగిన కీలక మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. 237 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 184 పరుగులు మాత్రమే చేసి 72 పరుగుల తేడాతో చిత్తైంది. జింబాబ్వే బ్యాటర్లలో బెనెట్ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ సత్తా చాటారు. సంజూ శాంసన్24 పరుగులు, అభిషేక్ శర్మ55 పరుగులు చేశారు. ఇరువురూ టీమ్ ఇండియాకు అదిరే ఆరంభాన్ని అందించారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు కూడా మెరుపు ఇన్నింగ్స్ తో స్కోరింగ్ రేట్ ఎక్కడా తగ్గకుండా వేగంగా పరుగులు సాధించారు. ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 సిక్సర్లతో చెలరేగడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా కు ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ దక్కింది. ఇక టీమ్ ఇండియా సెమీస్ కు చేరాలంటే ఆదివారం (మార్చి 1) విండీస్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలి.
http://www.teluguone.com/news/content/team-india-defeat-zimbabwe-36-214717.html





