అనిల్ అంబానీ ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
Publish Date:Feb 26, 2026
Advertisement
ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసం, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న సుమారు రూ.2,200 కోట్ల రుణానికి సంబంధించిన పత్రాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాల డాక్యుమెంట్లను తారుమారు చేసి వాస్తవాలను దాచిపెట్టినట్లు విచారణలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో భాగంగా బ్యాంకు రుణాలకు సంబంధించిన కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులను తప్పుదోవ పట్టించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా, ఆర్థిక లావాదేవీలపై మరింత లోతైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/cbi-searches-anil-ambani-house-and-offices-36-214707.html





