తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం... ఒకరు మృతి
Publish Date:Feb 26, 2026
Advertisement
తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. తిరుమల ఘాట్ రోడ్డులో 30వ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి లోయవైపు కిందపడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం, తమిళనాడుకు చెందిన నటరాజన్, మురళీ (మునిరత్నం) ఇద్దరూ బైక్‌పై కొండ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నటరాజన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మురళీని వెంటనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘాట్ రోడ్డులోని మలుపులు ప్రమాదకరంగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/accident-on-tirumala-ghat-road-36-214676.html





