కన్నుల పండువగా బ్రహ్మంగారి మఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం

Publish Date:Feb 26, 2026

Advertisement

 

శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 12వ మఠాధిపతిగా  శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ పట్టాభిషేక మమోత్సవం మంగళవారం (ఫిబ్రవరి 24) నుంచి    గురువారం (ఫిబ్రవరి 26) వరకూ     నభూతో న భవిష్యత్తు అన్నరీతిలో వేలాదిమంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

 వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం  ప్రస్తుత మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ,మఠాధిపతి సోదరులు  నొస్సం దత్తాత్రేయస్వామి,  వీరభట్లయ్య స్వామి, మఠాధిపతి బావమరిది, భవిష్యత్  మేనేజర్ పి.పి.ఎన్. ప్రసాద్ పర్యవేక్షణలో కన్నులపండువగా నిర్వహించారు. గురువారం (ఫిబ్రవరి 26)  సాయంత్రం మఠాధిపతి   వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారికి  తులాభారం కార్యక్రమం నిర్వహించారు.    ఈ పట్టాభిషేక మహో త్సవాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ  మఠాధిపతులు, పీఠాధిపతులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులుపెద్ద  సంఖ్యలో తరలి వచ్చారు.

పూర్వపు మఠాధిపతి శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామిజ్యేష్ట కుమారుడు వెంకటాద్రి స్వామికి మఠాధిపతి బాధ్యతలు అప్పగించారు. . తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూద నాచారి, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్      కే.యం. కిరణ్ కుమార్ తోపాటు మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, వైసీపీ నాయకులు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, సహకార పరపతి బ్యాంకు చైర్మన్ యల్లటూరి సాంబశివరెడ్డి, టిడిపి మండల నాయకులు ఎస్సార్ శ్రీనివాసులు రెడ్డి, ఎం పోలిరెడ్డి, పూజా శివ యాదవ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ యం. రామ గోవిందరెడ్డి, డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ ఈ.తిరుపాల్రెడ్డి తోపాటు కందిమల్లయ్యపల్లె పుర సంస్థాన ప్రజలు, వివిధ రాష్ట్రాల నుండి స్వామి శిష్యులు భక్తులు పాల్గొని పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి సౌకర్యం, భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారు .జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  వివిధ మండలాల నుండి పోలీస్ సిబ్బంది ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. మఠం పురవీధుల గుండా, ప్రాంగణమంతా చలువ పందిళ్ళు విద్యుద్దీపాలంక రణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

By
en-us Political News

  
ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి ఓ భర్త చేసిన పోరాటం మన వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ​అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో, కుటుంబ సభ్యులు ఆందోళనతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, "అంబులెన్స్ అందుబాటులో లేదు అన్న సమాధానం వచ్చింది.
జింబాబ్వే బ్యాటర్లలో బెనెట్ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ సత్తా చాటారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి పూర్తిగా మాజీ సీఎం జగన్‌నే కారణమని మంత్రి నిమ్మల విమర్శించారు.
ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసం, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
రెండో సారి అమెరికా ప్రెసిడెంట్‌ అయిన డోనాల్డ్ ట్రంప్ .. అగ్రదేశ అధినేతగా ప్రపంచానికి తానే బాస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు.
జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు.
పాకిస్థాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు తార స్థాయికి చేరాయి.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఒకే రోజు రెండు సార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరగనుంది
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.