ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి
Publish Date:Feb 26, 2026
Advertisement
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A-7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయంలో లొంగిపోయారు. విచారణలో భాగంగా దర్యాప్తు సంస్ధ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయన తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు. అరెస్ట్ తప్పించుకునేందుకు అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం ఇప్పటికే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలైన లిక్కర్ పాలసీల రూపకల్పనలోనూ, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా నిబంధనల్లో మార్పులు చేయడంలోనూ ముప్పిడి అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ భారీ వ్యవహారంలో సమన్వయకర్తగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల నిధుల మళ్లింపుకు కారణమయ్యారని అధికారులు భావిస్తున్నారు. దీర్ఘకాలంగా విదేశాల్లో ఉన్న అవినాష్ రెడ్డి చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో స్వయంగా వచ్చి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-case-36-214681.html





