జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా.. సెమీస్ ఆశలు సజీవం

Publish Date:Feb 26, 2026

Advertisement

టి 20 వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. జింబాబ్వేతో గురువారం (ఫిబ్రవరి 26) జరిగిన కీలక మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. 257 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే   20 ఓవర్లలో  6 వికెట్లు నష్టపోయి 184 పరుగులు మాత్రమే చేసి 72 పరుగుల తేడాతో చిత్తైంది.  జింబాబ్వే బ్యాటర్లలో బెనెట్  97 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు.  

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ సత్తా చాటారు. సంజూ శాంసన్24 పరుగులు, అభిషేక్ శర్మ55 పరుగులు చేశారు. ఇరువురూ టీమ్ ఇండియాకు అదిరే ఆరంభాన్ని అందించారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు కూడా మెరుపు ఇన్నింగ్స్ తో స్కోరింగ్ రేట్ ఎక్కడా తగ్గకుండా వేగంగా పరుగులు సాధించారు.

ఇషాన్ కిషన్  38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు. ఇక చివరిలో  హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 సిక్సర్లతో చెలరేగడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.  23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా కు ప్లేయర్  ఆప్ ది మ్యాచ్ దక్కింది.  ఇక టీమ్ ఇండియా సెమీస్ కు చేరాలంటే ఆదివారం (మార్చి 1) విండీస్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలి. 

By
en-us Political News

  
పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.
విశాఖపట్నం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, స్నేహితులు తనపై దాడి చేశారన్న అవమానభారంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.