ఎంతసేపైనా చర్చిద్దాం.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం

Publish Date:Apr 16, 2026

Advertisement

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చారిత్రక చర్చ ప్రారంభమైంది. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ   బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లుపై సుమారు   మారథాన్ చర్చ నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. ఈ చర్చలో ప్రతి రాజకీయ పార్టీకి తమ వాదనను గట్టిగా వినిపించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు చెప్పారు.  

ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన   ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి  కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై   22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో  అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం,  సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మూడు కీలక బిల్లులు దేశ రాజకీయ భవిష్యత్తును మార్చనున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మరియు లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచేందుకు  ఈ బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి రాజకీయ పక్షం తమ గళాన్ని వినిపించేందుకు వీలుగా చర్చా సమయాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. కిరణ్ రిజుజు ఈ బిల్లులపై ఎంతసేపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభలో ప్రకటించారు. సమయా భావం సమస్య తలెత్తకుండా సమయం కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో  సంఖ్యా బలంతో సంబంధం లేకుండా చిన్న పార్టీలకు కూడా చర్చలో ప్రసంగించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ప్రతి పార్టీకి మూడు గంటల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. శుక్రవారం (ఏప్రిల్ 17) సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ ఉంటుందని పేర్కొన్న ఆయన అవసరమైతే రాత్రి పొద్దుపోయినా సభ కొనసాగిస్తానని చెప్పారు. 

కాగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గళాన్ని గట్టిగా వినిపించేందుకు ప్రాంతీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి.   అంతకు ముందు చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ రంగు పులమవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు అత్యంత అవసరమన్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కాంగ్రెస్, డీఎంకే, వాటి మిత్ర పక్షాలు నీచ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే చిన్న చిన్న పనులు కూడా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్ వెలువడింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో దిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది.
నటి ఖుష్బూ సుందర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వేధిస్తున్న లేఆఫ్స్ పర్వం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
అత్తాపూర్ ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి జైలు శిక్ష విధించిన తెలంగాణ హై కోర్టు
యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పేరు! ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఆమె సంపాదిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితిపై చర్చ జోరుగా సాగుతోంది.
అధికారిక గణాంకాలు అభివృద్ధిని సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నయో అద్ధం పడుతున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ రంగాలు ఇప్పుడు వాటి అస్థిత్వం కోసం సామాన్యుడిని ఆర్థికంగా వేధించే యంత్రాలుగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబందులుగా మారుతున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.