శోభనం రాత్రి షాకిచ్చిన పెళ్ళికూతురు...రూ.90 లక్షలు ఇస్తేనే అంటూ కండిషన్!

Publish Date:Apr 16, 2026

Advertisement

 

పెళ్ళి అంటే నూరేళ్ళ పంట.. రెండు కుటుంబాల కలయిక. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక వివాహం మాత్రం ఊహించని మలుపు తిరిగింది. పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్త ముందు వింత కండిషన్ పెట్టి అందరినీ విస్తుపోయేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని జగదీష్‌పురా పరిధిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. వివాహం ముగిసిన తర్వాత తొలి రాత్రి సమయంలో వధువు తన భర్తను భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసింది. దీనికి వరుడు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వధువు తన పుట్టింటి వారికి సమాచారం అందించడంతో, వారు అబ్బాయి ఇంటికి చేరుకుని నానా హంగామా సృష్టించారు.

వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటిపై దాడి చేసి అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా, వరుడి కుటుంబాన్ని గదిలో పెట్టి బయట నుంచి తాళం వేశారు. గ్యాస్ పైప్‌లైన్‌ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేయడం ద్వారా ఇంటిని పేల్చివేసి అందరినీ సజీవ దహనం చేయాలని ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల వారు గమనించి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఘర్షణ అనంతరం వధువు తన వెంట తెచ్చుకున్న బ్యాగులతో పాటు, అత్తగారింట్లోని విలువైన బంగారు ఆభరణాలు, నగదును తీసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైంది. ఈ దాడిలో వరుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కేవలం డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా ఈ పెళ్ళి చేసుకున్నట్లు వధువు తన నోటితోనే చెప్పిందని బాధితులు పోలీసులకు వెల్లడించారు.

ప్రారంభంలో పోలీసులు కేసు నమోదుకు నిరాకరించినప్పటికీ, బాధితులు కోర్టును ఆశ్రయించడంతో జగదీష్‌పురా పోలీసులు రంగంలోకి దిగారు. వధువు, ఆమె తండ్రి మరియు ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పెళ్ళి కుదిర్చిన మధ్యవర్తి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న వధువు కోసం గాలిస్తున్నారు. ఇది కేవలం డబ్బు కోసం జరిగిన మోసమా లేక దీని వెనుక ఏదైనా పాత గొడవలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అమాయక యువకులను పెళ్ళి పేరుతో బురిడీ కొట్టించే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

By
en-us Political News

  
ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది. ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న.
కోయంబత్తూరు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సగం రోడ్డు వేసి.. మిగతా సగం రోడ్డు వేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజుల్లో రోడ్డు వేస్తారో లేదో తెలపాలనీ, లేని పక్షంలో సీఎం ఆఫీస్ కి వెళ్తామని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం (20-04-2026) అగ్నిప్రమాదం సంభవించింది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం సహకరించదని బాధ్యతలను పక్కన పెట్టేస్తుంటారు.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.
పశ్చిమ జపాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్లు చెబుతున్నారు. భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం జపాన్ లోని ఇషికావా పరిధిలోని నోటో ద్వీపంలో సంభవించింది. దాదాపు నిముషం పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
దురాశ ఉంటే జడ్జిలుగా ఉండే అర్హత లేదు...జస్టిస్ నాగరత్న సంచలన వ్యాఖ్యలు
తనపై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలనని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తూ.. ఈ జలసంధిని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటోంది. ఈ విడత మూసివేత వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతోందని రష్యా ముందస్తుగా ఇరాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం.
ఈ జలసంధి ప్రపంచ ఎనర్జీకి నాడి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20శాతం వరకు, ఈ సన్నని జలసంధి గుండా మాత్రమే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. దీని భౌగోళిక స్థానం చూస్తే.. ఒక వైపు ఇరాన్, మరో వైపు యూఏపీ. ఇది గల్ఫ్ నుంచి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రానికి వెళ్లే ఏకైక సముద్ర ద్వారం. అందుకే.. హోర్ముజ్ మూసివేత అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా బందీగా పెట్టగలదు అని చూపించే అత్యంత శక్తివంతమైన లీవర్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన 76వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈ తరహా వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. దీని ఫలితంగానే ప్రాజెక్ట్‌కు ప్రాజెక్ట్ పునర్విక రూపుదిద్దుకుంది.
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయలుదేరిన ఫ్లై91 విమానానికి ఆదివారం ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.