ఐపీల్ 2026.. బెంగళూరుకు వరుసగా రెండో విజయం.. సీఎస్కే పై ఆర్సీబీ విజయం

Publish Date:Apr 5, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్ లో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైపై ఆదివారం (ఏప్రిల్ 5) జరిగిన మ్యాచ్  లో ఆర్సీబీ అదరగొట్టింది.  మ్యాచ్ ఆద్యంతం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి భారీ విజయాన్ని అందుకుంది.  వరుసగా రెండు విజయాలతో గ్రూప్ లో టాప్ పొజిషన్ కు చేరుకుంది.  ఈ మ్యాచ్ లో  ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది.  చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.  ఆర్సీబీ బ్యాటర్   టిమ్ డేవిడ్  పాతిక బంతుల్లో  బంతుల్లో 70 నాటౌట్ తో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ స్కోరులో మూడు ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే టిమ్ డేవిడ్ విధ్వంసం ఏ రీతిలో సాగిందో అర్ధమౌతుంది.  251 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్   19.4 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో   స‌ర్ఫ‌రాజ్ ఖాన్  పాతిక బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు.  ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు.  

By
en-us Political News

  
అమెరికా విధించిన రెడ్ లైన్స్ వెనుక బలమైన కారణం ఉందన్న జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు.
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆర్డర్లు స్వీకరించేవారని పోలీసులు తెలిపారు. చెల్లింపులు ఫోన్ పే ద్వారా తీసుకుని, సరుకును రాపిడో, పోర్టల్ డెలివరీ సేవలతో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో తేలింది.
టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు.
ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పది బిలియన్ డాలర్ల వ్యయంతో 2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన మీడియా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందన్న విజయసాయి.. తన మీడియా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదనీ, ప్రజల సమస్యలపైనే గళమెత్తుతుందనీ చెబుతున్నారాయన. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా తన మీడియా సంస్థ నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తుందని చెప్పారు విజయసాయి.
అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు.
ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.