సంజూశాంసన్ హీరోచిత ఇన్నింగ్స్.. కోహ్లీ రికార్డు గాయబ్!
Publish Date:Mar 1, 2026
Advertisement
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో టీమ్ ఇండియా బ్యాటర్ సంజూ శాంసన్ హీరోచిత ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మొదటి బంతి నుంచి చివరి వరకు క్రీజులో ఉండి, 97 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడిలోను కాకుండా, అద్భుతమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో సంజూ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లలో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన భారత వికెట్ కీపర్‌గానూ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో భారత ఆటగాడిగానూ సంజూ నిలిచాడు.
http://www.teluguone.com/news/content/heroic-innings-by-sanju-samson-36-214845.html





