ఏఐ టెక్నాలజీతో అమెరికా రక్షణ వ్యవస్థకు సవాలు.. చైనా యుద్ధవ్యూహాలు

Publish Date:Apr 5, 2026

Advertisement

యుద్ధ వ్యూహాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ తంత్రాలలో కూడా ఏఐ ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది.  ఈ విషయంలో చైనా రెండడుగులు ముందే ఉంది. అమెరికా సైనిక బలగాల కదలికలు, వారి మోహరింపులను పసిగట్టేందుకు చైనా   ఏఐని సాధనం  మలుచుకుంది.   పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా మిలిటరీ రహస్యాలను ఛేదించేందుకు చైనా ఏఐని వినియోగిస్తోంది.

చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్ఐఎన్టి) ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి. ఈ డేటా విశ్లేషణ ద్వారా అమెరికా అత్యంత రహస్యంగా భావించే ఆపరేషన్లను కూడాచైనా పసిగట్టగలుగుతోంది.  

చైనా ప్రభుత్వం చేపట్టిన  మిలిటరీ-సివిల్ ఫ్యూజన్ విధానం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పౌర అవసరాల కోసం పనిచేసే సంస్థలను కూడా చైనా సైనిక ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా కంపెనీలు ఏఐ సహాయంతో అమెరికా రక్షణ కవచాలను ఛేదిస్తున్నాయి. దీనివల్ల ఇకపై యుద్ధరంగంలో ఏదీ రహస్యం కాదని,  స్టీల్త్  టెక్నాలజీకి కాలం చెల్లిందని చైనా సంస్థలు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుతున్నాయి.

ఈ పరిణామాలు అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అండతో నడిచే ఈ సంస్థలు తమ సైనికులకు ప్రత్యక్ష ముప్పుగా మారాయని అమెరికా హౌస్ సెలెక్ట్ కమిటీ పేర్కొంది. గతంలో ఈ ఏఐ నిఘా ద్వారా చైనా గుర్తించిన కొన్ని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టెక్నాలజీ సాయంతో అమెరికా రక్షణ వ్యవస్థలోని లొసుగులను చైనా బహిర్గతం చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండానే అగ్రరాజ్యం అమెరికాను వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు ఏఐని చైనా ఒక శక్తివంతమైన నిఘా సాధనంగా మార్చుకుంది. రాబోయే రోజుల్లో   ఏఐ యుద్ధతంత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తోంది.

By
en-us Political News

  
గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు.
ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది.
యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని డిపోల ముందు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో చేరి నిరసలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్ లు, బస్ స్టేషన్లు బోసిపోయాయి. ఇక హైదరాబాద్ లో అయితే సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనాథల రాతను మారుస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సంధించిన అక్షరాయుధం నెల్లూరులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మున్సిపల్ స్కూల్స్ భవనాలు చూసి ముగ్ధులై, భిక్షా పాత్రలను విసిరికొట్టి పుస్తకాలు పట్టిన ఆ చిన్నారుల పట్టుదల, నేడు వారిని సమాజం గర్వపడే హీరోలుగా నిలబెట్టింది.
వీరు ఒక వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి సి ఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్ పాతిక పరుగులు చేశారు. చివరిలో హెన్రిచ్ క్లాసెన్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఓ మైనర్ బాలుడు తన స్నేహితుల మాదిరిగా రీల్స్ చేసి గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కానీ అదే ఆలోచన చివరకు అతని ప్రాణాన్ని బలి తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక మామిడి తోట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే పరిమితమైంది.
త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.