Publish Date:Mar 13, 2026
తిరుపతి లడ్డూ తయారీ వినియోగంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వస్తున్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే సీబీఐ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నందున, పిటిషనర్ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా వాటిని సీబీఐకి అందించాలని సూచించింది.ఈ పిటిషన్‌ను మానూరు శ్రీనివాస్ సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. టిటిడి తయారు చేసే లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా హానికర రసాయనాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతోందని, అలాంటి ఆరోపణలను నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు.
అలాగే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవా లని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కోర్టు జోక్యం అవసరం లేదని భావించిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-dismiss-petition-on-laddu-adultration-36-215423.html
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్‌కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.