బిల్లు అడిగితే కత్తులతో దాడి… సరూర్‌నగర్‌లో రౌడీ షీటర్ల దౌర్జన్యం

Publish Date:May 6, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. బిల్లు చెల్లించమని అడిగిన సిబ్బందిపై కత్తులు, కట్టెలతో విరుచుకుపడిన దుండగులు హింసకు దిగడంతో ఈ ఘటన నగరంలో రచ్చ రచ్చ సృష్టించింది. ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో కొంతమంది యువకులు సరూర్‌నగర్‌లోని అర్బన్ రెస్టారెంట్‌కు వచ్చి భోజనం చేశారు. భోజనం అనంతరం రెస్టారెంట్ సిబ్బంది బిల్లు చెల్లించమని కోరగా, మొదట వాగ్వాదానికి దిగారు. క్షణాల్లోనే ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, దుండగులు రెస్టారెంట్ సిబ్బంది మరియు యాజమాన్యంపై దాడికి పాల్పడుతూ హంగామా సృష్టించారు.

దుండగులు ముందే సిద్ధంగా వచ్చినట్లు అనిపించేలా కత్తులు మరియు కట్టెలతో హోటల్ సిబ్బందిపై విరచికుపడుతూ హోటల్లో ఉన్న అద్దాలు ఫర్నిచర్ మరియు ప్లేట్లు పగలగొడుతూ కస్టమర్లను బయటకు వెళ్లి పొమ్మంటూ బెదిరింపులకు గురి చేస్తూ నానా హల్చల్ సృష్టించారు. రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపట్లోనే అక్కడి వాతావరణం యుద్ధరంగంలా మారిపోయింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం బాధితులు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి నిందితుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా నేరచరిత్ర కలిగిన ఏదుల ప్రసన్ రెడ్డి మరియు ఏదుల యశ్వంత్ రెడ్డి అనుచరుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. వారిని పట్టు కునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త లలిత్‌ను  ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ఈ ఇద్దరు దారుణంగా హత్య చేశారు.

ఈ నిందితులను పట్టుకునేం దుకు పోలీసులు జల్లడ పడుతున్నారు. ఈ ఘటనతో సరూర్‌నగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన మరోసారి నగరంలో రౌడీ షీటర్ల అల్లర్లు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చూపిస్తోంది. .

By
en-us Political News

  
పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలు భారతీయ నావికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.