శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్

Publish Date:May 6, 2026

Advertisement

 

ప్రముఖ ఏసీ తయారీ కేంద్రం క్యారియర్  సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి నారా లోకేశ్ బుధవారం (6-5-26న) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యారియర్ ఏసీ తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం శ్రీసిటీలో నుంచి సరఫరా చేయబోతోందని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన సేవలైనా ఒక్క వాట్సాప్ మేసేజ్‌తో చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. 

శ్రీసిటీలో 70 వేల మంది ఉద్యోగుల్లో 35 వేల మంది మహిళలు ఉన్నారని.. శ్రీశక్తికి ఇది నిదర్శనమన్నారు. శ్రీసిటీలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరులోపు ఏఐ ద్వారా నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నామని లోకేశ్ వెల్లడించారు. శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభించనుంది. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 40 ఎకరాల స్థలం కేటాయించారు. ఒకటి, రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1000 టన్నుల నుంచి 5000 టన్నుల సామర్థ్యం కలిగిన కూలింగ్‌ సిస్టమ్స్‌‌ను క్యారియర్ సంస్థ తయారుచేయనుంది. బుధవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
 

By
en-us Political News

  
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.