సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళల భద్రతను కేవలం ఫిర్యాదులు, కేసుల నమోదుతో పరిమితం చేయకుండా సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.హైదరాబాద్ జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
మహిళలను ఎవరైనా వేధిస్తే చూసి చూడనట్టు ఉండకూడదని, వెంటనే నిలబడి ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వేధింపులను నిర్లక్ష్యం చేయడం కూడా నేరాన్ని ప్రోత్సహించినట్లేనని అన్నారు. సొంత కుటుంబ సభ్యులకు ఎలా స్పందిస్తామో ఇతర మహిళల విషయంలో కూడా అదే తీరుగా స్పందించాలని పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేవలం కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బాధ్యత తీరిపోదని సీఎం పేర్కొన్నారు. మహిళను శక్తిగా భావించే సమాజంలో ఆమెకు ఎక్కడా అభద్రత ఉండకూడదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చేందుకు మనలోనే మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నామని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలను భాగస్వాములుగా చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు. తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
గతంలో మహిళలపై వేధింపులు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఆన్‌లైన్ నేరాలు పెరిగాయని సీఎం తెలిపారు. డీప్ ఫేక్ వీడియోలు వంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేశామని చెప్పారు.ఏదైనా సంఘటన జరిగితే బాధితురాలినే నిందించే చెడు సంప్రదాయాన్ని సమాజం విడిచిపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం “స్టాండ్ విత్ హర్” అనే నినాదంతో అందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం మాజీ సలహాదారు వేము నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ చారు సిన్హా, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stand-with-her-campaign-36-215172.html
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
బయో గ్లాస్ మోడల్‌లో 12 రకాల విభిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుడి కండరాల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఏఐ కమాండ్స్‌ను అర్థం చేసుకుని, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది.
ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది.
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.
ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. గురువారం అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి కంపించింది.