స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడడానికి, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసమే అతడు భారత్‌కు వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం భారత్‌కు వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుత ఐపీఎల్ సమయంలో కూడా ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు కోహ్లీ కొన్ని షరతులు పెట్టాడట. మ్యాచ్‌లకు మధ్యలో ఎక్కువ వ్యవధి ఉంటే తనను ప్రత్యేక విమానంలో లండన్‌కు పంపించాలని కోరాడట. అందుకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కూడా ఓకే చెప్పిందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శల గురించి కోహ్లీ స్పందించాడు .
ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందని చాలా మంది అంటున్నారు. మిమ్మల్ని కూడా ఆ లిస్టులో ఎందుకు చేర్చారు అనే ప్రశ్నకు కోహ్లీ స్పందించాడు. ఆ విషయం తనకు తెలియదన్నాడు. అయినా , ఆ ప్రశ్న తనను ఎందుకు అడుగుతున్నావని ఎదురు ప్రశ్నించాడు. తానేమీ ఓవర్సీస్ ప్లేయర్‌ను కానని, ఆ ప్రశ్న విదేశీ ఆటగాడిని అడగమని చెప్పాడు. అలాగే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు తాను ఎలాంటి షరతులూ పెట్టలేదని తెలిపాడు. ఇక, గత సీజన్‌లో ఆర్సీబీ కప్ గెలిచిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-kohli-foriegn-player-36-216681.html
రూ.72,000 కోట్ల గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఒక ప్రధాన రాజకీయ వివాదాంశంగా మారింది. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ ఉనికిని ఎదుర్కోవడానికి ఇది ఒక కీలకమైన వ్యూహాత్మక ఆస్తి అని బీజేపీ ప్రచారం చేస్తుండగా, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఇది తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి, స్థానిక గిరిజన హక్కులకు హాని కలిగించే ఒక ప్రణాళికాబద్ధమైన దుస్సాహసం అని వ్యతిరేకిస్తోంది.
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.