తెలంగాణలో 130 మంది మావోల లొంగుబాటు
Publish Date:Mar 7, 2026
Advertisement
తెలంగాణలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బంజారా హిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండో కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయినట్లు ప్రకటించారు వీరిలో ఏపీ మావోయిస్టు కార్యదర్శి చలసాని నమత కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తె మాధవి అలియాస్ షకీలా కూడా లొంగిపోయిన వారిలో ఉండటం విశేషంగా మారింది. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తంతో పాటు మవోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, గన్‌మెన్లు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానంపై నమ్మకం ఉంచి ప్రధాన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకుని లొంగిపోయినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 128 ఆయుధాలు సమర్పించగా, వాటిలో AK-47 రైఫిల్స్ – 31, INSAS రైఫిల్స్ – 21, SLR రైఫిల్స్ – 20, .303 రైఫిల్స్ – 18, 7.62 బోర్ ఆయుధాలు – 17, 8 mm ఆయుధాలు – 2, .315 రైఫిల్ – 1, INSAS LMG – 1, 9 mm పిస్టల్ – 1, BGL – 2 ఉన్నాయి. అదనంగా మరికొన్ని ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఆయుధాలతో పాటు మొత్తం 5,205 తూటాలను కూడా మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వ పునరావాస విధానం కీలక పాత్ర పోషిస్తున్నదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/maoist-surrender-36-215174.html





