ఏపీలో చండ్ర నిప్పులు.. వడగాల్పులు

Publish Date:Apr 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్లో భానుడు చండ్రప్రచండుడిగా మారి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.  వేసవి ప్రారంభంలోనే  అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో  జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.  ముఖ్యంగా శనివారం (ఏప్రిల్ 4)  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది.  ఉత్తర కోస్తా,  మన్యం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.   విజయనగరంలో 24, శ్రీకాకుళంలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాలలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే  పోలవరం పరిధిలో 9, అల్లూరి జిల్లాలో 3, కాకినాడలో 3, అనకాపల్లిలో 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండలంలో కూడా ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం సాధారణానికి మించి ఉంటుందని రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది.

ఇక ఆదివారం ( ఏప్రిల్ 5)  పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.  ఇకపోతే శుక్రవారం (ఏప్రిల్ 3)  పార్వతీపురం జిల్లాలోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ రికార్డయ్యింది. అలాగే.. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో   జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

By
en-us Political News

  
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
బయో గ్లాస్ మోడల్‌లో 12 రకాల విభిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుడి కండరాల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఏఐ కమాండ్స్‌ను అర్థం చేసుకుని, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది.
ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది.
ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. గురువారం అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్‌, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి కంపించింది.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.