ఏపీలో 13 ఏళ్ల పిల్లలకు సోషన్ మీడియా బ్యాన్.. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు
Publish Date:Mar 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీలో గురువారం (మార్చి 6) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న 90 రోజులలోగా దీనికి అమలులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని భావిస్తున్నామనీ, అయితే ఈ నిషేధాన్ని 16 సంవత్సరాల లోపు పిల్లల వరకూ విస్తరించాలని భావిస్తున్నామనీ, దీనిపై మేధావులూ, నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకుని నిర్ణయిస్తామని తెలిపారు. ఇప్పటికే ఫ్రాన్స్, మలేషియా, పలు యూరోపిన్ దేశాలు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ పై తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. సైకాలజిస్టులు, మేధావులు, సామాజికవేత్తలు, టీచర్లు, తల్లిదండ్రులూ కూడా పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాకు అడిక్ట్ కావడం వల్ల పిల్లలలో సహజ నైపుణ్యాలు తగ్గిపోతున్నాయని పలు అధ్యయనాలు తేల్చిన సంగతి తెలిసిందే వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలన్న చారిత్రక నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
నేడు శాసనసభలో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా వలన జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారిని దానికి దూరంగా ఉంచకపోతే అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. కనుక 13 సం.లు ఆలోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోనికి తీసుకున్నామన్నారు. 90 రోజులలోగా ఈ నిషేధాన్ని ఆచరణలోకి తీసుకు వస్తామన్నారు. అయితే 13 సం.లకే పరిమితం చేయాలా లేక 16 సం.ల వరకు ఈ నిషేధం వర్తింపజేయాలా? అని చర్చించుకుంటున్నాము. మేధావులు, నిపుణుల అభిప్రాయలు తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటాము,” అని అన్నారు.
http://www.teluguone.com/news/content/social-media-ban-for-children-36-215127.html





