మండలిలో ఎమ్మెల్సీ బొత్సకు స్వల్ప అస్వస్థత
Publish Date:Mar 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విపక్ష నేత, ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ సభలో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై తూలి పడబోయారు. ఆయన పరిస్థితిని గమనించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెంటనే అప్రమత్తమై బొత్సను పట్టుకుని నిలబెట్టారు. దీంతో సభలో కాసేపు ఆందోళన నెలకొంది. సభా అధికారులు వెంటనే స్పందించి వైద్యులను పిలిపించారు. అక్కడికక్కడే వైద్య బృందం బొత్స సత్యనారాయణకు ప్రాథ మిక పరీక్షలు నిర్వహించింది. పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం బొత్స హెల్త్ కండిషన్‌పై డాక్టర్లు ప్రత్యేకంగా పర్య వేక్షణ కొనసాగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిట ల్‌కు చెందిన వైద్యుడు చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా బొత్సతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. బీపీ సమస్య తో ఇబ్బంది పడుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో పాటు, బీపీ నియంత్రణలోకి రాకపోతే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. కాగా వారం రోజుల క్రితం కూడా బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనమండలిలో అస్వస్థతకు గురైన అనంతరం ఆయన సమావేశాలను మధ్యలోనే వీడి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సభలో జరిగిన ఈ ఘటనతో సభ్యులు కొంతసేపు ఆందోళన వ్యక్తం చేయగా, వైద్యులు పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టంచేయడంతో సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
http://www.teluguone.com/news/content/mlc-botsa-suffers-minor-illness-in-legislative-council-36-215124.html





