కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

Publish Date:Apr 24, 2026

Advertisement

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి వేదికగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో సాంస్కృతిక విప్లవానికి ఊతమిచ్చేలా తెలంగాణ జాగృతిని స్థాపించిన కవిత, తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటడంతో పాటు పలు రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తి అవసరమనే నినాదంతో ఆమె నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. అద్వయ కన్వెన్షన్ సెంటర్‌తో పాటు దానికి ఆనుకుని ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం నుంచి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

కవిత కార్యక్రమాల షెడ్యూల్ ఇలా ఉంది:
• ఉదయం 7.30 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి బయల్దేరుతారు
• ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు
• ఉదయం 8.25 గంటలకు అక్కడి నుంచి బయల్దేరుతారు
• ఉదయం 9.30 గంటలకు మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటారు
• ఉదయం 10.00 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు
• ఉదయం 10.05 గంటలకు ప్రసంగం ప్రారంభిస్తారు
• గంటా పావు నుంచి గంటన్నర వరకు కవిత ప్రసంగించే అవకాశం ఉంది

సభా ప్రాంగణానికి ప్రత్యేక పేర్లు కూడా ఖరారు చేశారు:
• సభా ప్రాంగణం – ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం
• ప్రధాన ద్వారం – ప్రజాకవి కాళోజీ నారాయణరావు ద్వారం
• ఇతర ద్వారాలు – రాణి రుద్రమదేవి ద్వారం, మారోజు వీరన్న ద్వారం, చాకలి ఐలమ్మ ద్వారం
కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
 

By
en-us Political News

  
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్‌కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రాజస్థాన్ లోని పర్యాటక నగరంఉదయ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.